
మొదట డ్రోన్ ల ద్వారా 500 మీటర్ల వరకు ఈ ఔషధ పంపిణి ప్రయోగాత్మకంగా జరిగినప్పటికీ అది మంచి ఫలితాలను ఇస్తుండటం తో పరిధిని 2-5 కిలోమీటర్ల వరకు పెంచారు. అనంతరం ఈ పరిధి పెంచుకుంటూ పోతూ 20-25-30 కిలోమీటర్ల వరకు ఈ సేవలు అందుబాటులోకి తెచ్చారు. అయితే ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వ రంగ సంస్థ టివర్క్స్ రూపొందించిన నూతన సాంకేతికతతో ఈ పరిధి తక్కువ సమయంలోనే 45 కిలోమీటర్ లు చేరుకునేట్టుగా తీర్చిదిద్దారు. ఇప్పటికే గత డ్రోన్ లతో అనేక మందికి సేవలు అందించారు. ఈ తాజా సాంకేతికత తో సేవలు అందించాల్సి ఉంది.
ఈ నూతన సాంకేతికతను నేటి నుండి అమలు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే ఈ పరిధిని పెంచుకుంటూ పోతూ ఈ నెలాఖరులోగా 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి మరి ఔషధ పంపిణి చేసే పెట్టుకున్నట్టు వారు తెలిపారు. 3.5 కిలోల బరువును మోసే విధంగా రాబోయే సాంకేతికత ఉండనుందని వారు తెలిపారు. నేటి నుండి వాడుతున్న డ్రోన్ 25 కిలోమీటర్ల తరువాత రీఛార్జ్ లేదా బ్యాటరీ మార్చడం ద్వారా దాని పరిధిని మారుస్తున్నట్టు వారు తెలిపారు. అయితే రాబోయే సాంకేతికతతో ఈ లోపం ఉండబోదని, సరాసరి 100 కిలోమీటర్లు ప్రయాణించగలిగే డ్రోన్ లను తయారు చేస్తున్నట్టు వారు తెలిపారు.