1). ఓలా S 1 ఎలక్ట్రిక్ స్కూటర్:
ఓలా కంపెనీ నుంచి ఎలక్ట్రానిక్ బైక్ ను విడుదల చేయడం జరిగింది. ఇది గంటకు 115 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది ఈ బైక్ ని తీసుకోవాలంటే రూ.99,999 మనకు లభిస్తుంది. అయితే వీటిని అడ్వాన్స్ బుకింగ్ కింద బుక్ చేసుకోవాలి. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 181 కిలోమీటర్లు వెళ్ళగలదు.
2).TVS ఎలక్ట్రిక్ స్కూటర్:
టీవీఎస్ కంపెనీ నుంచి ఈ బైక్ను విడుదల చేయడం జరిగింది. ఇది గంటకు 78 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. దీని ధర 1,00,777 మనకు లభిస్తుంది. ఇది ఒక్కసారి చార్జింగ్ చేస్తే..75 కిలోమీటర్లు వెళ్ళగలదు. ఈ బైక్ కి EMI సదుపాయం కూడా కలదు.
3). సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్:
ఈ బైక్ కేవలం భారతదేశంలోనే తయారుచేయబడిన ఎలక్ట్రిక్ బైక్. ఇది గంటకు 105 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. ఈ బైక్ కూడా ఒక్కసారి ఛార్జ్ చేస్తే..236 కిలోమీటర్లు వెళ్ళగలదు.
4). ఏథర్ ఎలక్ట్రిక్ బైక్..450X:
ఏథర్ అనే కంపెనీ నుంచి ఈ బైకు విడుదల చేయడం జరిగింది. ఇది గంటకు 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ బైక్ ధర 1,44,500 రూపాయలు కలదు. ఈ బైక్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 116 కిలోమీటర్లు వెళ్ళగలదు.
ఈ బైక్స్ అన్ని చూసి వాటిలో మనకు ఏది నచ్చితే వాటిని తీసుకోవాలి.