ఈ నాయిస్ సెన్స్ ధర 2,499 రూపాయల కగా , వీటిని ప్రత్యేకమైన ఆఫర్ కి రూ.1,100 రూపాయలకి మనకు అందించనుంది. కానీ ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందో కంపెనీ తెలియజేయలేదు. ఈ నాయిస్ సెన్స్ బ్లూ, బ్లాక్ రెండు కలర్ లో మనకి లభిస్తుంది. ఇది మనకి అమెజాన్ వెబ్ సైట్ లో దొరుకుతుంది. అయితే ఈ నాయిస్ బ్యాండ్ యొక్క స్పెషల్ ఏంటో చూద్దాం.
నాయిస్ సెన్స్ ప్రకారం 10 మీటర్ల దూరం వరకు పనిచేస్తుంది. అంతేకాకుండా కాలింగ్ కోసం ఒక సరికొత్త ఫీచర్లతో మైకును ఇందులో అమర్చింది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఈ నెక్ బ్యాండ్ స్పెషల్ గా కాల్ రిజెక్ట్, వాల్యూమ్ కంట్రోల్, టచ్చు సపోర్టుతో కలదు.ఇక ఇందులో ఒక ఫిజికల్ బటన్ కూడా ఉండదు.
ఇక ఈ నాయిస్ నెక్ బ్యాండ్ కేవలం ఎనిమిది నిమిషాలు చార్జింగ్ చేస్తే చాలు.. ఎనిమిది గంటలపాటు నిరంతరం మాట్లాడుతూ ఉండవచ్చు. ఇక ఈ నెక్ బ్యాండ్ లో రెండు మ్యాగ్నెటిక్ ఉండటం వల్ల మనం ఉపయోగించనపుడు అవి రెండూ కలిసి ఉంటాయి. ఇక అంతే కాకుండా ఈ నాయిస్ గూగుల్ అసిస్టెంట్ తో కూడా పనిచేస్తుంది.ఇది ఒకేసారి రెండు మొబైల్స్,MP3 కీ ఉపయోగించుకోవచ్చు. ఛార్జింగ్ కేబుల్ USB టైప్స్ -C పోర్టును కలిగి ఉంటుంది. ఈ నాయిస్ యొక్క బరువు 30 గ్రాములు కలదు.