
GIONEE Max Pro ధర, ఫీచర్స్
వాస్తవానికి GIONEE Max Pro ని ఫ్లిప్‌కార్ట్ నుండి 7299 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఇది 6.52 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేతో ఉంటుంది. ఈ ఫోన్‌లో 6000mAh బ్యాటరీ ఇచ్చారు. ఈ ఫోన్ వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండడమే కాకుండా ప్రాథమిక కెమెరా 13 మెగా పిక్సెల్‌లు. అలాగే 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ లో వినియోగదారులు 3 GB ram, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ ను పొందుతారు. అవసరమైతే వినియోగదారులు 256 GB వరకు SD కార్డ్ ద్వారా స్టోరేజ్ ను పెంచుకోవచ్చు.
Infinix Hot 10 Play ధర, ఫీచర్స్
ఈ ఇన్ఫినిక్స్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ నుండి రూ. 8299కి కొనొచ్చు. ఈ ఫోన్‌లో 6000 mAh బ్యాటరీతో పాటు 3 GB ram మరియు 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఇది వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండగా, దీనిలో ఫస్ట్ కెమెరా 13 మెగా పిక్సెల్‌లు. అలాగే 8 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంటుంది. అనేక ఇతర మంచి ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంటాయి.
Samsung Galaxy F12 ధర, ఫీచర్స్
ఈ samsung phoneలో 6000 mAh బ్యాటరీ, 4 GB ram, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. అలాగే వినియోగదారులు 512 GB SD కార్డ్‌ను కూడా స్టోరేజీ కోసం ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ ఫోన్‌లో బ్యాక్ ప్యానెల్‌లో క్వాడ్ కెమెరా సెటప్ ఉండగా అందులో ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్స్, ఇంకా ముందు వైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 512 GB వరకు SD కార్డ్‌ని ఈ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ ఫోన్ 6.5 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే తో ఉండగా ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 10299.
POCO M3 ధర, ఫీచర్స్
ఫ్లిప్‌కార్ట్ నుండి POCO M3 స్మార్ట్‌ఫోన్‌ను రూ .11999 కి కొనొచ్చు. ఈ ఫోన్ 6 GB ram, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు వినియోగదారులు 6000 mAh బ్యాటరీని ఇందులో పొందుతారు. ఈ ఫోన్ 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని వెనుక ప్యానెల్‌పై ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ఉండగా, అందులో ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్స్. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌తో వస్తుంది.