వినూత్నమైన ఆలోచనలతో ,నైతిక విలువలతో, శక్తికి మించిన పని చేయడానికి సిద్ధపడిన వ్యక్తులను, శక్తులను, వ్యవస్థలను, ప్రభుత్వాలను గతంలో మనం చూసి ఉన్నాము. ఇదే సందర్భంలో వర్తించే ఒక శ్రీశ్రీ పాటలోని పాదం కొంత మంది వృద్ధులు పుట్టుకతో యువకులు అంటే ఇక్కడ లక్ష్యము ఆకాంక్షలు పట్టుదల నిబద్ధత పైన పని చేస్తారని అర్థం.  మనలోనే ఎక్కువ శాతం మంది చిత్తశుద్ధిని అమ్ముకొని, నిజాయితీ నీతికి తిలోదకాలిచ్చి, సామాజిక బాధ్యతను విస్మరించి, స్వప్రయోజనాలకు పాల్పడుతూ, రాజకీయ లబ్ధి కోసమే జీవిస్తూ, వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న వారు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ పాట లోని మరొక పదాన్ని వర్తింప చేసుకోవచ్చు కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు. అంటే వృద్ధులు కాకపోయినా బాధ్యతను విస్మరించి స్వప్రయోజనాలకు పాల్పడే పూర్తి స్వార్ధపరులు అని అర్థం.


    ఈ రకమైన వారిలో రాజకీయ నాయకులు, కార్పోరేట్ సంస్థలు, అవినీతి అధికారులు, ఉన్నత వర్గాలు, బాధ్యతను విస్మరించి తమకోసమే చూసుకునే సంపన్నులు, పేదరికంలో ఉన్నా బాధ్యతను విస్మరించినవాళ్ళు ఈకోవకే చెందుతారు.
    ఎక్కడైతే బాధ్యతను గుర్తించి, వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తారో వారిని మనము స్మరించుకుందాము. జ్ఞప్తికి చేసుకుంటాము .ఆదర్శంగా తీసుకుంటాం. అవి ప్రభుత్వాలు కావచ్చు !ముఖ్యమంత్రులు కావచ్చు !ఆదర్శవంతమైన అధికారులు కావచ్చు !సామాన్య జీవులు కూడా కావచ్చు!.

     ఢిల్లీ పాలనలోని ప్రత్యేకత:
   
     ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం గత రెండు దఫాలుగా అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఏర్పడిన టువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విద్యా ,వైద్య రంగాలలో దేశానికే తలమానికమైన కృషిని కొనసాగిస్తున్నది. అంతర్జాతీయ స్థాయి విద్యను ఇతర దేశాల నుండి శిక్షణ ఇప్పించి ఢిల్లీ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం ద్వారా మెరుగైన టువంటి విద్యను సామాన్య అట్టడుగు వర్గాలకు అందజేస్తున్నారు. ఆ రాష్ట్రంలో విద్యా విధానం గురించి వార్డు కౌన్సిలర్ నుండి ముఖ్యమంత్రి వరకు అవగాహన ఉంటుంది. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడం ద్వారా ఇటీవల ప్రైవేటు రంగం నుండి రెండు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరినట్లుగా స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడం అక్కడి ప్రభుత్వం యొక్క పనితీరుకు నిదర్శనం. ఇక ప్రయోగాత్మకంగా ప్రతి పాఠశాలలోనూ వైద్యులతో సహా క్లినిక్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉచిత వైద్యాన్ని అందించ టానికి ప్రయత్నాలు జరుగుతూనే కొన్ని పాఠశాలల్లో ఇప్పటికీ అమలు అవుతుంది.
    భారతదేశంలోనే విద్యారంగంపై  బడ్జెట్లో 25 శాతంగా కేటాయిస్తూ ప్రభుత్వ రంగంలో ఉన్న టువంటి పాఠశాలలు కళాశాలలు అత్యంత ఉన్నతంగా తీర్చిదిద్దిన ఏకైక ప్రభుత్వంగా ఢిల్లీని చెప్పుకోవచ్చు. ఇక వైద్యరంగం పరంగా వీధికో దవాఖాన ఏర్పాటుచేసి పూర్తి స్థాయిలో ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ పాలనా పరమైన విషయాల లోపల కూడా భారతదేశంలో ఏ రాష్ట్రము చేయనటువంటి పాలనను ఢిల్లీ ప్రజలకు అక్కడి ముఖ్యమంత్రి అందిస్తున్నారు. ఇది ఢిల్లీ గురించి రేఖామాత్రంగా మాత్రమే పరిచయం.


    తమిళనాడు కేరళ తదితర ప్రభుత్వాలు:
   
    గత సంవత్సరం తమిళనాడులో డిఎంకె ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి స్టాలిన్ ప్రభుత్వం కరోనా సమయంలో ఆరోగ్యశ్రీ ద్వారా మరియు ప్రభుత్వ రంగంలోనే ఉచితమైన వైద్యాన్ని అందించి దేశానికి ఆదర్శంగా  నిలిచింది. ప్రైవేటు వైద్యశాలలను ప్రభుత్వం ఆదేశించి తన ఆధీనంలోకి తీసుకొని ఉచిత వైద్యాన్ని సగర్వంగా అందించిన మొదటి రాష్ట్రంగా తమిళనాడును వర్ణించవచ్చు. క్రమంగా ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేసే క్రమంలో వైద్యరంగంలో వినూత్న చర్యలతో ముందుకెళ్తున్న తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశంశించడమే కాదు. ఆ ప్రభుత్వ పాలన నుండి మిగతా రాష్ట్రాలు గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.


     సాంప్రదాయ పరిపాలనకు భిన్నంగా పరిపాలనలో వనరులను పొదుపుగా వాడుకోవడం తో పాటు అట్టడుగు వర్గాలకు మేలు అయినటువంటి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో ఉన్నత వర్గాల యొక్క సౌకర్యాలను క్రమంగా కోత పెట్టడం శుభ సూచకము మాత్రమే కాదు. చాలా ధైర్యం తో కూడుకున్న చర్య. ప్రజల సొమ్ముతో ఎమ్మెల్యేలు మంత్రులు అసెంబ్లీలో ఇంతకాలంగా భోజనము చేయడం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం అయినదని ఇక నుండి అసెంబ్లీ లో ఉండే క్యాంటీన్ల మూసివేస్తున్నట్లు ఎవరి భోజనం వారే తెచ్చుకోవాలని ఆదేశించడం వినూత్నమైనదే కాదు సాహసోపేతమైన చర్య. అంతే కాకుండా మరొక విషయాన్ని ప్రస్తావిస్తూ మంత్రులు శాసనసభ్యులు రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎవరైనా ప్రయాణిస్తున్నప్పుడు కాన్వాయ్లోని కార్ల సంఖ్యను గణనీయంగా తగ్గిం చాలని సూచన చేస్తూ నిర్ణయం తీసుకోవడం కూడా హర్షణీయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: