యూపీలో యుద్ధ విమానాల కోసం పూర్వాంచల్ లో ఎక్స్ ప్రెస్ వే ఎయిర్ బేస్ ను సిద్ధం చేస్తున్నారు. దానిపై ఈ నెల 13 నుండి ట్రయల్ రన్ ప్రారంభం అవుతుంది, నాలుగు రోజులపాటు ఇది కొనసాగుతుంది. దీనిపై 16న మోడీ మరియు రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ హెర్క్యూలస్ విమానంలో ల్యాండ్ అవ్వనున్నారు. దీనిపై ప్రధాని మోడీ సమక్షంలో ఐదు ఎయిర్ బేస్ ల నుండి 30 యుద్ధ విమానాలు ఇక్కడ ల్యాండ్ అవుతాయి. అయితే ఇందులో సుకోయ్-30 ఎంకేఐ, సి-130జే సూపర్ హెర్క్యూలస్ వంటి విమానాలు టచ్ అండ్ గో ప్రకారంగా అలా ల్యాండ్ అవడం తోనే వెంటనే టేకాఫ్ అవుతాయి. అయితే ఇదంతా భారతదేశ వైమానిక శక్తిని ప్రపంచం ముందు చాటడానికి అని తెలుస్తుంది.

దేశవ్యాప్తంగా 25 అత్యవసర హైవే రన్ వే లను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 53 కంటే ఎక్కువ ఎయిర్ బేస్ లు వివిధ ప్రాంతాలలో అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ యుద్ధంలో ఏవైనా రన్ వే లు ధ్వంసం అయితే పక్కనే ఉన్న రోడ్లను అందుకు వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసమే ప్రభుత్వ రక్షణ మంత్రి సహా రోడ్ల మంత్రిత్వ శాఖ  ఉమ్మడి కార్యాచరణతో 25 ఎక్స్ ప్రెస్ వే లను నిర్మించడానికి సిద్ధం అయ్యారు. వీటిలో ఎక్కువ పాక్, చైనా, రాజస్థాన్, అరుణాచల ప్రదేశ్, మేఘాలయ, పంజాబ్, గుజరాత్ లాంటి సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న హై వే లపై 3 కిమీ స్ట్రెయిట్ పాకెట్స్ ను మార్క్ చేస్తారు. ఈ ప్రాంతాన్ని రోడ్డు రన్వే గా మారుస్తారు.

ఇలాంటి రోడ్డు రన్వే లు కొత్తవేమీ కాదు, రెండవ ప్రపంచ యుద్ధ సమయం లోనే ఈ తరహా అడుగులు పడ్డాయి. అనంతరం పాక్ తమ ఇస్లామాబాద్-పెషావర్, ఇస్లామాబాద్-లాహోర్ మోటార్ వేలను రోడ్డు రన్వే లుగా మార్చడం జరిగింది. దానికి సమాధానంగా భారత్ దాదాపు రెండు డజన్ల మేర ఇలాంటి రన్ వే లను సిద్ధం చేసింది. ప్రతి రహదారిపై దాదాపు 50-100 కిమీ ఇలాంటి రన్ వే లను నిర్మాణం చేసే యోచనలో భారత్ ఉంది. ఇలా తయారు చేసిన ఢిల్లీ సమీపంలోని యమునా ఎక్స్ ప్రెస్ వే పై మిరాజ్ 2000 విజయవంతంగా ల్యాండ్ చేయబడ్డాయి. అలాగే ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వే పై కూడా మిరాజ్, సుఖోయు లు విజయవంతంగా ల్యాండ్ చేయబడ్డాయి. ప్రస్తుతం యూపీలో కూడా ఇదే తరహాలో ఎక్స్ ప్రెస్ వే సిద్ధం చేశారు. ఇలాంటి వాటి కోసం సాధారణంగా కావాల్సిన అత్యవసర విభాగం కూడా అప్పటికప్పుడు సిద్ధం చేయబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: