కరోనా కాలం నుండి వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌ల వినియోగం వేగంగా పెరిగింది. సామాజిక దూరాన్ని కొనసాగించడానికి, కంపెనీలు రిమోట్ వర్క్ కల్చర్‌ను పూర్తిగా డిజిటల్ స్పేస్‌కి మార్చాయి. అయితే వీడియో కాలింగ్, కాన్ఫరెన్స్ కోసం మార్కెట్లో అనేక ఇతర యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ మీట్ వీటిలో ఒకటి, ఇది వినియోగదారులకు అనేక అధునాతన ఫీచర్‌లు, కొత్త ఫీచర్‌లను అందిస్తూనే ఉంది. అందుకే ఈ యాప్‌ ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందింది. గూగుల్ రూపొందించిన ఈ కాన్ఫరెన్సింగ్ సాధనం google Hangouts Meetకి ప్రత్యామ్నాయం. ఈ సాఫ్ట్‌వేర్ అందరికీ ఉచితం, కానీ google Workspace Essentials యూజర్‌లు కొన్ని అదనపు ఫీచర్‌ లను పొందుతారు. ఇందులో 24 గంటల కంటే ఎక్కువ సమయం పాటు మీటింగ్‌లు, దాదాపు 150 మంది పార్టిసిపెంట్‌లను జోడించడం, మీటింగ్ రికార్డింగ్‌లను google డిస్క్‌లో సేవ్ చేసే ఆప్షన్ ఉన్నాయి.

మీటింగ్ రికార్డింగ్ ఎంపిక చాలా ఉపయోగకరమైన ఫీచర్. ఇది డేటాను సేకరించడంలో సహాయ పడుతుంది లేదా విద్యార్థులకు గమనికలు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే అదే సంస్థకు చెందిన వినియోగదారులు మాత్రమే గూగుల్ మీట్ రికార్డింగ్‌ లను ఉపయోగించగలరు. ఈ సదుపాయం G-Suite Enterprise వినియోగదారులకు మాత్రమే పరిమితం అయ్యింది. మీరు గూగుల్ మీట్ లో వీడియో సమావేశాన్ని రికార్డ్ చేయాలనుకుంటే ఈ చిట్కాలను పాటించండి.

గూగుల్ మీట్ లో వీడియోను రికార్డ్ చేయడం ఎలా ?
1. ముందుగా మీటింగ్ ప్రారంభించండి. ఆపై కుడి దిగువ మూలలో ఉన్న మూడు చుక్కలపై నొక్కండి.
2. పాప్ అప్ ఎగువన ఉన్న 'రికార్డింగ్ మీటింగ్'పై క్లిక్ చేయండి.
3. ఆపై రికార్డింగ్ ప్రారంభం అయిన తర్వాత "అగ్రీ"పై క్లిక్ చేయండి.
4. రికార్డింగ్‌ ని ఆపడానికి మూడు నిలువు చుక్కలపై మళ్లీ క్లిక్ చేసి, ఆపై జాబితా ఎగువన మీరు చూసే "స్టాప్ రికార్డింగ్" మెను ఎంపికను ఎంచుకోండి.
5. గూగుల్ మీట్ లో రికార్డ్ చేయబడిన మీటింగ్ కోసం మీటింగ్ ఆర్గనైజర్ గూగుల్ డిస్క్‌కి వెళ్లి, 'మీట్ రికార్డింగ్‌లు' ఫోల్డర్ కోసం వెతకండి. ఆర్గనైజర్ రికార్డింగ్‌కి లింక్‌తో ఇమెయిల్‌ ను స్వీకరిస్తారు. మీరు ఆర్గనైజర్ కాకపోయినా రికార్డింగ్‌ ను యాక్టివేట్ చేసినట్లయితే, మీరు రికార్డింగ్‌కి లింక్‌తో కూడిన ఇమెయిల్‌ను పొందొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: