
ఫోన్ నంబర్‌ను ఉపయోగించి మీ బ్యాంక్ ఖాతా సమాచారం వాట్సాప్ ద్వారా గుర్తించ బడుతుంది. మీ UPI పిన్ నాలుగు లేదా ఆరు అంకెల సంఖ్య అని. ఏదైనా చెల్లింపు చేసే ముందు దానిని నమోదు చేయాలి. మీ వ్యక్తిగత UPI పిన్ యాప్‌లో చేసిన ప్రతి చెల్లింపును రక్షిస్తుంది. దీనిని వరితోనూ షేర్ చేయకూడదు. మీరు ఇప్పటికే మీ బ్యాంక్ ఖాతా కోసం ఒకటి కలిగి ఉంటే, వాట్సాప్ లో కొత్త UPI పిన్ని సృష్టించాల్సిన అవసరం లేదు.
వాట్సాప్ పేమెంట్స్ UPI పిన్ గుర్తులేకపోతే లేదా మర్చిపోయినా దాన్ని అప్డేట్ చేయవచ్చు లేదా కొత్తదాన్ని సృష్టించవచ్చు. దశల వారీ ప్రక్రియను ఇక్కడ తెలుసుకుందాం.
ఆండ్రాయిడ్ వినియోగదారులు తమ UPI పిన్ని ఇలా సెట్ చేసుకోవచ్చు:
1: ముందుగా మీ వాట్సాప్‌ని తెరిచి, మెనులో మరిన్ని ఎంపికను ఎంచుకోండి.
2: చెల్లింపుల మెను నుండి బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి.
3: మీ UPI పిన్ని మార్చడానికి UPI PINని మార్చండి లేదా UPI PINని మర్చిపోయారాపై నొక్కండి.
4: మీరు UPI పిన్ను మరచిపోతే, కొనసాగించుపై నొక్కండి, ఆపై డెబిట్ కార్డ్ నంబర్, గడువు తేదీ యొక్క చివరి ఆరు అంకెలను నమోదు చేయండి. కొన్ని బ్యాంకులకు ఇక్కడ cvv నంబర్‌ను సమర్పించవలసి ఉంటుందని గమనించడం ముఖ్యం.
5: ప్రస్తుత UPI పిన్, కొత్త UPI పిన్ని నమోదు చేయండి. మీరు UPI పిన్ని మార్చు ఎంచుకుంటే కొత్త UPI పిన్ని నిర్ధారించండి.