ప్రభుత్వం యొక్క కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సిఈఆర్ టి) గూగుల్ క్రోమ్ లో ఎదురయ్యే ఇబ్బందులను ఫ్లాగ్ చేసింది, వీలైనంత త్వరగా బ్రౌజర్‌ను తాజా వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోమని వాడకం దారులను కోరింది. సైబర్ అటాకర్లు నుంచి రక్షణ పొందాలంటే అప్ డేట్ తప్పని సరి అని హెచ్చరించింది.
ఇంటర్నెట్‌లో సర్ఫ్ చేయడానికి గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను విస్తృతంగా ఉపయోగించే వ్యక్తులను ప్రభుత్వం హెచ్చరించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేసే ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సిఈఆర్ టి) నుండి 'అధిక తీవ్రత' కలిగిన హెచ్చరిక వచ్చింది. సిఈఆర్ టి నివేదిక ప్రకారం క్రోమ్‌లో అనేక దుర్బలత్వాలు  గుర్తించబడ్డాయి, ఇది వినియోగదారుల సిస్టమ్‌పై ఏకపక్ష కోడ్‌ను అమలు చేయడానికి సైబర్ దాడి చేసేవారి ద్వారా ఉపయోగించబడవచ్చు.
 సిఈఆర్ టి నివేదిక  ప్రకారం, వర్షన్ 8లో  |ఉ|న్నకన్ఫ్యూజన్ కారణంగా  ఉన్న ఇబ్బందులన్నీ గుర్తించబడ్డాయి. వీటి దావారా  హ్యాకర్లు వ్యక్తిగత డేటాకు యాక్సెస్ పొందే అవకాశం ఉంది. అంతేకాక కంప్యూటర్‌లో మాల్వేర్‌ను  చొప్పించే అవకాశం ఉందని తెలిపింది. క్రోమ్ బ్రౌజర్ ను తాజా అప్‌డేట్‌ చేసుకుని ఇబ్బందులను పరిష్కరించుకోవాలని  కోరింది. క్రోమ్ వినియోగ దారులు వీలయినంత త్వరాగ  అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. లొసుగులను పూడ్చడానికి మరియు రిమోట్‌గా వినియోగదారుల కంప్యూటర్‌లను హ్యాకర్లు నియంత్రించకుండా నిరోధించడానికి మరియు గోప్యతను నిర్ధారించడానికి 22 రకాల భద్రతా పరిష్కారాలను అందించినట్లు సాఫ్ట్‌వేర్ దిగ్గజం తెలిపింది.


2008 వ సంవత్సరంలో తొట్టతొలిసారిగా  క్రోమ్ బ్రౌజర్  వాడకం లోకి వచ్చింది. విండోస్ వాడకం కోసం ఇది రూపుదిద్దుకున్నా.. తరువాతి కాలంలో ఇది చాలా రూపాంతరాలు చెందిందనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇప్పిటి వరకూ చాలా మందికి ఉపయుక్తంగా ఉన్న క్రోమ్ బ్రౌజర్ క్రోమ్. దీని వాడకం, సులభంగా ఉండటంతో పాటు, సురక్షితంగా ఉండటం కూడా ఇది విస్తృత వాడకానికి ఒక ప్రధాన కారణం. ఆండ్రాయిడ్ కోసు ఇది రూపొందించ బడింది. ఇష్టమైన వార్తా కథనాలను, సైట్ లను త్వరగా చూసేందుకు, అత్యంత ప్రియమైన వాటిని డౌన్ లోడ్ చేసుకునందుకు కోట్లాది మంది ఈ  క్రోమ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: