దీని కోసం వాట్సాప్ లో వినియోగదారులకు ముందుగా సందేశం పంపుతారు. అందులో వారి రిజిస్టర్డ్ నంబర్ తో KBC SIM కార్డ్ లక్కీ డ్రా పోటీ 2021 కోసం సెలెక్ట్ అయ్యిందని చెప్తారు. నగదు బహుమతిని పొందడానికి వినియోగదారులు లింక్ పై క్లిక్ చేయాలి అంటారు. ఈ లింక్ ద్వారా నేరుగా కేబీసీ కార్యాలయానికి కనెక్ట్ అవుతారని ఆ సందేశంలో ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఇలాంటి స్కామ్ తెరపైకి వచ్చింది. ఇది అబద్ధమని తేలింది. ఇప్పుడు ఢిల్లీ పోలీసుల సైబర్ క్రైమ్ యూనిట్ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ కొత్త వాట్సాప్ సందేశం సెప్టెంబర్, నవంబర్ లలో వచ్చిన సందేశానికి కొంత భిన్నంగా ఉంటుంది. సైబర్ సెల్ ప్రకారం ఇటువంటి సైబర్ క్రైమ్ కేసులలో ఎక్కువ మంది +92 నెంబర్ తో మెసేజ్ అందుకుంటారు. మెసేజ్‌లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి, డబ్బును క్షణాల్లో మటుమాయం చేస్తాయి. చివరికి స్కామర్లు తమ ఫోన్ నంబర్లను మార్చుకుంటారు. మీకు ఇలాంటి సందేశాలు వస్తే వెంటనే సైబర్ క్రైమ్ ను ఆశ్రయించండి. ఇంటర్నెట్ లో జరిగే ఇలాంటి స్కాం ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండడం మంచిది. లేదంటే మనకు తెలియకుండానే మనం మోస పోవడానికి నిముషాలు చాలు. ఇలాంటి మోసాల పట్ల అవగాహన ఉంటే మోసపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి.