ఖగోళ శాస్త్రంలో అంతుచిక్కని రహస్యాలు చాలానే ఉన్నాయి. ఇక అలాంటి వాటి కోసం ఖగోళ శాస్త్రవేత్తలు ఇంకా తమ పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు.ఇక తాజాగా ఖగోళ శాస్త్రవేత్తలను ఓ రహస్యం అనేది ఇప్పుడు వెంటాడుతోంది.ఇక అంతరిక్షంలో సుదూర తీరన ఉన్న.. పాలపుంత నుంచి వస్తున్న రేడియో సంకేతాలు ఇప్పుడు శాస్త్రవేత్తల్ని బాగా ఆశ్చర్యపరుస్తోంది. సుమారు నాలుగు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మిల్కీవే నుంచి ప్రతి 18 నిమిషాలకు ఒకసారి ఈ రేడియో తరంగాలు అనేవి రిలీజ్ అవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. పశ్చిమ ఆస్త్రేలియాలోని ముర్చిసన్‌వైడ్‌ ఫీల్డ్‌ అర్రే టెలిస్కోప్‌ను ఉపయోగించిన శాస్త్రవేత్తల బృందం దీనిని కనుగొనడం జరిగింది. అయితే ఆ గెలాక్సీలో ఉన్న ఓ నక్షత్రం నుంచి ఆ తరంగాలు వస్తున్నట్లు వారు గ్రహించారు. కానీ ఆ వస్తువును ఇప్పటి దాకా అసలు గమనించలేదని మన ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ముర్చిసన్ వైడ్‌ఫీల్డ్ ఆరే టెలిస్కోప్ ద్వారా ఆ నక్షత్ర సమూహాన్ని గుర్తించడం జరిగింది. కుర్టిన్ యూనివర్సిటీకి చెందిన ఆస్ట్రోఫిజిస్ట్ నటాషా హర్లే వాకర్ ఆ రహస్య వస్తువుకు చెందిన అంశాలను కూడా వెల్లడించడం జరిగింది.ఇక ఇది 2018 వ సంవత్సరంలో  తొలిసారిగా గుర్తించడం అనేది జరిగింది.ఇది నేచర్ పత్రికలో దీనికి సంబంధించిన రిపోర్ట్‌ను పబ్లిష్ చేయడం అనేది జరిగింది.ఇక నక్షత్రం ఆకారంలో ఉండి.. తిరుగుతున్న ఆ అంతరిక్ష వస్తువును మార్చి 2018 వ సంవత్సరం లో తొలి సారి  ఖాగోళ శాస్త్రవేత్తలు గుర్తించడం అనేది జరిగింది. ఇక ఆ నక్షత్రం విడుదల భూమి నుంచి కూడా మనం చూడవచ్చు అని శాస్త్రవేత్తలు స్పష్టంగా చెబుతున్నారు. ఆ నక్షత్రం అనేది ఇక నిర్జీవం కావడమో లేక దట్టమైన న్యూట్రాన్ స్టార్ లేదా మరణించిన పొట్టి నక్షత్రమైనా అయి ఉంటుందని ఇంకా అలాగే దానికి అయస్కాంత శక్తి కూడా ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా అనేది వేస్తున్నారు. ఇక ముర్చిసన్ వైడ్‌ఫీల్డ్ ఆరే టెలిస్కోప్‌తో అంతరిక్షాన్ని పరిశీలిస్తున్న సమయంలో కూడా ఆ నక్షత్రాన్ని టైరోన్ ఓడోహెర్టి అనే డాక్టరేట్ విద్యార్థి గుర్తించడం అనేది జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: