
ఈ మధ్యన టెక్నాలజీ రంగంలో వివిధ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే నిన్న మొన్నటి వరకు సామాన్యుల నుండి పెద్ద పెద్ద ఐటీ దిగ్గజాల వరకు హ్యాకర్ సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటిదే కాకపోయినా దాదాపుగా సోషల్ మీడియాలో టాప్ లో దూసుకుపోతున్న దిగ్గజ యాప్ ట్విట్టర్ తమ కోట్లాది కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ సేవలకు అంతరాయం కలిగాయి. దాంతో వినియోగదారులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. శుక్రవారం నాడు అనగా నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో వెబ్‌సైట్ 'డౌన్ డిటెక్టర్' ట్విట్టర్‌కు అంతరాయం కలిగినట్లు తెలిసింది.
కాగా ట్విట్టర్ సేవలలో ప్రపంచ వ్యాప్త అంతరాయానికి టెక్నికల్ బగ్ ఉందని, అయితే ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించినట్లు అయినప్పటికీ వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి, అంతరాయాలకు క్షమాపణలు చెబుతున్నామంటూ తెలియచేసింది ట్విట్టర్ యాజమాన్యం. ఈ మెసేజ్ ను ట్విట్టర్ రాత్రి 11.44 గంటలకు పోస్ట్ చేయడం జరిగింది. ట్వీట్‌లను పోస్ట్ చేయకుండా అదే విధంగా టైమ్ లైన్‌లను లోడ్ చేయకుండా, అడ్డుకునే సాంకేతిక బగ్‌ను పరిష్కరించినట్లు తెలియచేసారు. కాగా ఇపుడు మళ్ళీ ట్విట్టర్ ను యదావిధిగా యూజర్లు వినియోగించుకోవచ్చు అని పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయని పేర్కొన్నారు. ట్వీట్ చేయబడింది.
శుక్రవారం నాడు ప్రముఖ సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ సేవలకు ప్రపంచ వ్యాప్తంగా అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. దీంతో పలు సమస్యలను ఎదుర్కొన్న ట్విట్టర్ ఖాతాదారులు వెంటనే ఫిర్యాదు చేయడం మొదలు పెట్టారు. కాగా అందుకు స్పందించిన ట్విట్టర్ వెంటనే చర్యలను తీసుకుని సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఇదే విధంగా నిన్న ఎయిర్టెల్ సేవలకు కూడా ఇబ్బందులు కలిగిన విషయం తెలిసిందే. ఎందుకు ఇలా నెట్వర్క్ కు సంబంధించిన సర్వీసులు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో తెలియని పరిస్థితి. అయితే ఇందుకు హ్యాకర్లకు ఏమైనా సంబంధం ఉందా అన్నది కూడా పరిశీలించాల్సి ఉంది.