
అదే సమయంలో ఇక ఒకవేళ నగదు కావాలి అన్న బ్యాంకు కి వెళ్లాల్సిన అవసరం లేదు. కస్టమర్లకు అందుబాటులో ఉండే విధంగా అన్ని బ్యాంకులు కూడా ఏటీఎంలను ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే కస్టమర్లు ఆయా బ్యాంకులకు వెళ్లి ఏటీఎం ద్వారా నగదు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఇలా బ్యాంకు ఖాతాదారులకు నగదు అవసరాలను తీర్చేందుకు ఎన్నో రకాల ఏటీఎంలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.
ఇకపోతే ఇప్పుడు ఏకంగా బంగారం కోసం కూడా ఏటీఎంలు రాబోతున్నాయ్ అనేది తెలుస్తుంది. చార్మినార్ సికింద్రాబాద్ అబిడ్స్ లలో మూడు గోల్డ్ ఏటీఎంలు ప్రారంభించ బోతున్నట్లు గోల్డ్ శిక్కా సంస్థ ఇటీవలే వెల్లడించింది. ఇక వీటి నుంచి 0.5 నుంచి 500 వరకు గ్రాముల బంగారాన్ని నాణెం రూపంలో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు దీనికోసం డెబిట్ క్రెడిట్ కార్డులు లేదా తాము జారీ చేసిన ప్రీపెయిడ్ కార్డులను కూడా ఉపయోగించేందుకు అవకాశం ఉంది అంటూ గోల్డ్ శిక్కా సంస్థ తెలిపింది. ప్రస్తుతం బ్రిటన్ దుబాయ్ లో మాత్రమే గోల్డ్ ఎటిఎంలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే..