ఆధార్ లో మార్పులు చేస్తే ఇక అన్ని కార్డులలో మార్చినట్లే. ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది అనుకుంటున్నారా ? కానీ మీరు వింటున్నది నిజమే. ఆధార్ కార్డులో కనుక మీ అడ్రెస్స్ డీటైల్స్ మార్చినట్లైతే మిగిలిన డ్రైవింగ్ లైసెన్స్, భీమా పాత్రలు, తదితర పత్రాలలో సైతం మారుతుంది. అయితే ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు, ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా మంది తమ RC , పాన్ కార్డ్ ,భీమా పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ లను డిజి లాకర్ లలో చాలా భద్రంగా దాచుకుంటున్నారు. తద్వారా ఎపుడు ఎక్కడ ఏ డీటైల్స్ కావాలన్నా ఎక్కడా వెతుక్కునే అవసరం లేకుండా వెంటనే చూసుకునే ఫెసిలిటీ ఉంది.

అయితే ఇపుడు మరో స్పెషల్ ఫీచర్ ను మనకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అదేమిటి అంటే త్వరలోనే డిజి లాకర్ లోని పత్రాల్లో అడ్రస్ డీటెయిల్స్ లను సులభంగా మార్చు కునే విధంగా వెసులుబాటు అందుబాటులోకి రానుంది. ఒక ఆధార్ కార్డు లో అడ్రస్ మారిస్తే చాలు మిగిలిన అన్ని డాక్యుమెంట్స్ లో దానంతట అవే మారిన డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి. అలా అయ్యేలా చేసేందుకు uidai కృషి చేస్తోంది. ఇప్పటికే ఈ విషయం నిమిత్తం అయి కేంద్ర రవాణా శాఖతో చర్చలు జరుపుతోందట UIDAI. వీలయినంత త్వరలోనే పన్ను శాఖ , పాన్ కార్డులో మార్పులకు శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఇది కనుక అందుబాటులోకి వస్తే చాలా వరకు అడ్రెస్స్ డీటైల్స్ లో జరిగే గందరగోళాలు అన్నీ తగ్గుతాయి. ఏదేమైనా మన దేశంలో డిజిటల్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుండటం గర్వ కారణం. డిజిటల్ సేవల్లో పురోగతి చోటు చేసుకోవడం వలన పనులు ఇంకా సులభంగా, వేగంగా మారి అభివృద్ధికి దోహద పడతాయి. మరి చూద్దాం ఇప్పటిలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయో?

మరింత సమాచారం తెలుసుకోండి: