ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా బాగానే కొనసాగుతోంది.. ఇక వీరికి అనుకూలంగానే. తయారీ సంస్థలు కూడా పోటీపడి మరి సరికొత్త మోడల్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఓలా, వన్, ఇతర కంపెనీలకు సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాలను భారత్లోకి విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు విదేశీయ కంపెనీ అయిన ఓకినావా మరొకసారి కొత్త మోడల్ బైక్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని ఓకినావా ఓఖీ-90 అనే పేరుతో విడుదల చేయడం జరిగింది. ఈ బైక్ అల్ట్రా స్టైలిష్ లుక్ తో బాగా ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ప్రముఖ బ్రాండెడ్ కలిగిన కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ లకు గట్టి పోటీ ఇస్తోంది. దీని ధర రూ.1.21 లక్షలు గా నిర్ణయించింది ఓకినావా. అయితే ఈ బైకు ఒక్క ప్రత్యేకతలను చూద్దాం.


ఓకేనావా okhi-90 ఎలక్ట్రిక్ బైక్..3.8kwh మోటార్ సహాయంతో ఈ బైక్ పనిచేస్తుంది. ఈ బైక్ ను రెండు విభాగాలుగా డిజైన్ చేయబడింది. ఈ ఎకో మోడల్లో గరిష్టంగా 55 కిలోమీటర్ల నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చు. అయితే స్పోర్ట్స్ మోడల్ లో మాత్రం 85 నుండి 90 కిలోమీటర్ల వరకు అందుకోగలరని ఆ సంస్థ తెలియజేసింది. ఈ బైక్ గరిష్ట గా 10 సెకన్లలోనే 90 కిలోమీటర్ల వరకు వేగాన్ని అందుకోగలదట.ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మొట్టమొదటి సారిగా 16 అంగుళాలు గా ఉండే టైర్లను అమర్చడం జరిగిందట. ఇంతవరకు ఇలాంటి e-bike నే ఏ సంస్థ విడుదల చేయలేదని ఓకినావా సంస్థ వారు తెలియజేశారు. ఇక వీటితో పాటుగా ముందు వెనుక భాగంలో ఎల్ఈడి లైట్స్ ను కూడా ఇచ్చారు. ఇన్ బుల్ట్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టువిటీ.. డిజిటల్ స్పీడోమీటర్ మరియు కొన్ని అత్యాధునిక ఫీచర్లతో కూడా ఈ బైకు కి అమర్చినట్లు తెలుస్తోంది. ఈ బైకులు దేశవ్యాప్తంగా ఉన్న తమ డీలర్ల వద్ద దొరుకుతాయని ఆ సంస్థ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: