ఫేమస్ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్..సెల్ ఫోన్ ప్రియుల కోసం అదిరిపోయే సరికొత్త డీల్స్ తీసుకువచ్చింది. ఎక్కువ రేటు పెట్టి ఖరీదైన కొత్త ఫోన్లను కొనుగోలు చేయలేని వినియోగదారుల కోసం సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్స్ ను ఫ్లిప్ కార్ట్ అందుబాటులోకి తెచ్చింది.ఇక ఈ ఫోన్లను మంచి డిస్కౌంట్ లో అందిస్తుంది. యాపిల్, ఎంఐ, శాంసంగ్ ఇంకా అలాగే మోటోరోలా వంటి బ్రాండ్లకు చెందిన refurbished ఫోన్లను అతితక్కువ ధరకే వినియోగదారులు ఇందులో కొనుగోలు చేయవచ్చు. వీటిలో యాపిల్ ఐఫోన్ 6s మోడల్ ధర వచ్చేసి రూ.8,799లకే లభిస్తుంది. ఇది 128జీబీ యాపిల్ ఐఫోన్ 7 మోడల్ రూ.15,499లకే లభిస్తుంది. వీటితో పాటుగా mi ఫోన్లలో కూడా కనిష్టంగా రెడ్మీ 5A రూ.4190లకే లభిస్తుండగా..రెడ్మీ 7 ప్రో అయితే రూ.8790కే అందుబాటులో ఉంది.అలాగే గూగుల్ పిక్సెల్ సిరీస్ లో 3A మోడల్ కనిష్టంగా రూ.10,490లకే లభిస్తుండగా..పిక్సెల్ 3 128జీబీ వచ్చేసి మోడల్ గరిష్టంగా రూ.13,999కె అందుబాటులో ఉంది. శాంసంగ్ ఫోన్లు కూడా ఈ ఆఫర్లో ఉన్నాయి.


ఇక సెకండ్ హ్యాండ్ Refurbished మోడల్స్ అయినప్పటికీ ఈ ఫోన్ల క్వాలిటీని ప్రత్యేకంగా నిపుణులు బాగా పరీక్షిస్తారు. ఈ ఫోన్లపై 12 నెలల వారంటీ, 7 రోజుల్లో రిప్లేసెమెంట్ ఇంకా అలాగే ఒరిజినల్ యాక్సిస్సోరీస్ తో కలిపి ఇస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ కంపెనీ పేర్కొంది. అయితే ప్రస్తుతం స్టాక్ ఉన్నంత వరకే కేవలం ఈ ఆఫర్ అనేది ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ పై వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్ ను బట్టి ఇలా refurbished మొబైల్స్ ను డిస్కౌంట్ లో అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ కంపెనీ తెలిపింది.కాబట్టి ఆసక్తి వున్నవారు లేట్ చెయ్యకుండా ఫ్లిప్ కార్ట్ యాప్ ని సందర్శించి మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: