1). స్మార్ట్ కార్డ్ షేరింగ్:
ఈ ఫీచర్ సహాయంతో మెసేజ్ లోని సమాచారాన్ని ఇతరులకు ఒక ఇమేజ్ రూపంలో మనం పంపించుకోవచ్చు.. ఇందులో స్మార్ట్ కార్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక ఆ తర్వాత మెసేజ్ ను సెలెక్ట్ చేస్తే చాలు ఆ టెక్స్ట్ మొత్తం ఫోటో రూపంలో మారిపోతుండటం.
2). అర్జెంట్ మెసేజెస్:
మనం పంపించే మెసేజ్ ఏదైనా సరే అవతల వ్యక్తి చూడాలి అనుకుంటే ఈ ఫీచర్ ను ఉపయోగిస్తే సరిపోతుందట. అది ఎలాగంటే మనం పంపించిన మెసేజ్ అవతలి వ్యక్తి చూసే వరకు వారి ఫోన్ స్క్రీన్ పై నే ఇది కనిపిస్తూ ఉంటుంది.
3). స్మార్ట్ SMS:
మన ఫోన్ లో ఇన్ బాక్స్ లో వచ్చే మెసేజ్ లు... అవసరమైన వాటి కంటే ఎక్కువ మెసేజ్లు వస్తూ ఉంటాయి. దీంతో చాలా మంది ఆ మెసేజ్లు చదవడాన్ని మానేస్తుంటారు. దీంతో ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ఈ సరికొత్త ఫ్యూచర్ ను తీసుకువచ్చారు.
4). ఎడిట్ చాట్ మెసేజ్:
మనం అవతలి వ్యక్తికి మెసేజ్ పంపిన తర్వాత కూడా వాటిని ఎడిట్ చేసుకునే అవకాశాన్ని ఈ ఫీచర్ ను ట్రూ కాలర్ మనకు అందిస్తోంది. అయితే మనం పంపించిన వ్యక్తి కి మెసేజ్ చూసిన కూడా వీటిని ఎడిట్ చేసుకోవచ్చట.