వాట్సప్ కు పోటీగా ఎన్నో మెసేజింగ్ యాప్స్ వచ్చినప్పటికీ కూడా వాట్సాప్ తన స్థానాన్ని మాత్రం పదిలంగానే ఉంచుకుంది. ఇలాంటి సమయంలోనే యూజర్స్ కోసం సరి కొత్త ఫీచర్లను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది వాట్సాప్. అదేమిటంటే వాట్సాప్ లో 100 MB సైజు కంటే ఎక్కువ ఉన్న ఫైల్స్ ను మనం షేర్ చేసుకోలేమని విషయం తెలిసినదే.. అయితే వాట్సప్ కు పోటీగా వచ్చిన కొన్ని యాప్స్ లలో మాత్రం 2 GB ఫైల్స్ ను కూడా షేర్ చేసుకునే అవకాశం ఉన్నది. దీంతో కొంతమంది యూజర్స్ వాట్సప్ కంటే వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
దీంతో కాస్త అలర్ట్ అయిన వాట్సప్ సరికొత్త ఫ్యూచర్ ని తీసుకు వచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందట. త్వరలోనే 2 GB వరకు ఉండే ఫైల్ అయినా షేర్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించనుంది వాట్సాప్. ఇలాంటి సరికొత్త ఫీచర్లతో మన ముందుకు రాబోతోంది. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం ఈ ఫీచర్ ను అర్జెంటీనా లోని యూజర్ల పరిరక్షణలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆతర్వాత అనంతరం ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో తీసుకు రాబోతున్నట్లు సమాచారం. వీటిని ఆండ్రాయిడ్, OS యూజర్లకు కూడా అందుబాటులో ఉండనుంది. అయితే మొదట్లో వాట్సప్ కేవలం 16 GB సైజులో ఉండే పైసలు మాత్రమే షేర్ చేసుకునే అవకాశం ఉన్నది.. ఆ తర్వాత 100MB మారిపోయింది. దీని తర్వాత 2GB కి మారిపోతుంది.