కొత్త ఆవిష్కరణలు కనుగొనాలంటే శాస్త్రవేత్త అయి ఉండాల్సిన అవసరం లేదు. సరి కొత్తగా ఆలోచించాలి అంటే పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటి అద్భుతమైన సృష్టించేందుకు అవకాశం ఉంది. నేటి రోజుల్లో టెక్నాలజీని   ఉపయోగించుకుంటున్న ఎంతో మంది ఎన్నో వినూత్న ఆవిష్కరణలతో తెరమీదికి వస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఘటన వెలుగులోకి వస్తున్నాయి. టాలెంట్ ఎవరి సొత్తు కాదు అన్న విషయాన్ని ఎంతో మంది నిరూపిస్తున్నారు. ఇక్కడ ఒక తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఇది మరోసారి నిరూపించాడు


 చదువుతుంది తొమ్మిదో తరగతి అయినప్పటికీ తన బుర్ర మాత్రం ఎంతో షార్ప్ అని నిరూపించి ఏకంగా శాస్త్రవేత్తలకు తీసిపోని విధంగా ఒక సరి కొత్త వస్తువును తయారు చేసాడు. అతని పేరు అంకురీత్ కర్మాకర్   అసోంలోని కరీంగంజ్ కు చెందిన ఈ బాలుడు ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు  అయితే ఇటీవలే అందుల కోసం ప్రత్యేకమైన బూట్లు తయారు చేశాడు విద్యార్ధి.  ఇంతకీ ఈ బూట్ల స్పెషాలిటీ ఏంటి అని అనుకుంటున్నారు కదా.. అందులు బూట్లు వేసుకుని నడిస్తే ఇకముందు ఎవరైనా అడ్డు వచ్చారు అంటే వెంటనే ఆ బూట్లు శబ్దాలు చేస్తాయి. అంతేకాదు ఎదురుగా ఏమైనా అడ్డు వస్తే వెంటనే అప్రమత్తం కూడా చేస్తాయ్.


 కొన్నిసార్లు అంధులు రోడ్డు పై నడుస్తున్న సమయంలో  ఎదురుగా ఏదైనా వాహనం వచ్చి ప్రమాదానికి గురి అవుతూ ఉంటారు. మరికొన్ని సార్లు ఎదురుగా ఎవరైనా వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాగా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ ప్రత్యేకమైన బూట్లు తయారు చేసినట్లు తెలుస్తోంది  ఈ బూటులో  ఏర్పాటుచేసిన సెన్సార్ పెద్దగా శబ్దాలు చేస్తుంది  దీంతో సదరు వ్యక్తులు అప్రమత్తమై సురక్షితంగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రత్యేకమైన బూట్లు తయారు చేసిన తొమ్మిదో తరగతి విద్యార్థి భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేస్తానని చెబుతున్నాడు.. తనకు మద్దతుగా ఇస్తే ఈ పరికరాన్ని తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకు వస్తానని చెబుతున్నాడు. శాస్త్రవేత్త కావడమే తన లక్ష్యం అంటూ చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: