ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ధరలు కొంత వరకు తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు . కస్టమర్లకు అవసరమయ్యే అన్ని అత్యాధునిక టెక్నాలజీ లతో కలిసి మొబైల్ తయారీ సంస్థలు కూడా సరికొత్త స్మార్ట్ మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే మోటోరోలా ఇండియా  తాజా గా విడుదల చేసిన మోటో జి 22 స్మార్ట్ ఫోన్  సేల్ ప్రారంభం అయ్యింది. తొలి సేల్ లో కేవలం రూ.10,000 లోపే  స్మార్ట్ ఫోన్ ను  మీరు కొనుగోలు చేయవచ్చు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్థే.. తాజాగా పదివేల లోపు సెగ్మెంట్ లో విడుదలైన మోటో జి 22 స్మార్ట్ఫోన్లో క్వాడ్ కెమెరా సెటప్.. 90 హెడ్జెస్ LCD డిస్ప్లే, అలాగే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలు కూడా ఇందులో అమర్చడం గమనార్హం. ఇప్పటికే ఇలాంటి బడ్జెట్లో రెడ్ మీ రియల్ మీ ఫోన్ లు పోటీపడుతుండగా ఇక ఈ ఫోన్ లకు గట్టిపోటీ ఇవ్వడానికి మోటో జి 22 కూడా సిద్ధం అయ్యింది. ఇక ఇందులో 4gb ర్యామ్,  64gb స్టోరేజ్ వేరియంట్ తో లభిస్తున్న ఈ మొబైల్ కేవలం 10, 999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం సేల్ ప్రారంభం అయ్యింది కాబట్టి ఫ్లిప్కార్ట్ లో ఈ మొబైల్ అందుబాటులో ఉంది.

ఇక ఏప్రిల్ 14వ తేదీ లోపు కొనుగోలు చేసే వారికి మోటో జీ  22 స్మార్ట్ఫోన్ కేవలం ₹9999 లభిస్తుంది. ఆ తరువాత కొనుగోలు చేసే వారికి రూ.10,999 వరకు అందుబాటులో ఉండడం గమనార్హం. ఇక ఐ సి ఐ సి ఐ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసినట్లయితే రూ. 750 రూపాయలు తగ్గింపు కూడా ఉంటుంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. ఇక ఇందులో మింట్ గ్రీన్, ఐస్బెర్గ్ బ్లూ తో పాటు కాస్మిక్ బ్లాక్ రంగులలో కూడా అందుబాటులో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: