ఇక మీ వద్ద పాత స్ప్లెండర్ మోటార్‌ బైక్ కనుక ఉంటే ఇక ఇప్పుడు మీరు దానిని అధికారికంగా ఓ ఎలక్ట్రిక్ బైక్‌గా కూడా మార్చుకోవచ్చు. గత సంవత్సరం సెప్టెంబర్‌ నెలలో ముంబైకి చెందిన గోగో ఏ1 (GoGo A1) అనే ఓ స్టార్టప్ కంపెనీ, పెట్రోల్‌తో రన్ అయ్యే హీరో స్ప్లెండర్ (Hero Splendor) బైక్‌లను బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చేందుకు గాను ఓ ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్‌ను రిలీజ్ చేసింది.ఇక ఇప్పుడు ఈ కిట్‌ను ఎవరైనా తమ స్ప్లెండర్ బైక్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఎందుకంటే, ఈ కన్వర్షన్ కిట్ అనేది ఇన్‌స్టాలేషన్ కోసం గోగో ఏ1కు ఇప్పుడు ఏఆర్ఏఐ (ARAI) అనుమతి కూడా వచ్చింది.ఇక గోగో ఏ1 రూపొందించిన హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్ లో భాగంగా పాత స్ప్లెండర్ మోటార్‌సైకిల్‌లోని పెట్రోల్ ఇంజన్‌ను తొలగించి దాని స్థానంలో బ్యాటరీ ప్యాక్ ఇంకా అలాగే వెనుక చక్రంలో హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగిస్తారు. ఈ కిట్ సపోర్ట్ తో పూర్తి చార్జ్ పై మాక్సిమం 150 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించవచ్చని దీనిని తయారు చేసిన ఇంజనీర్లు చెబుతున్నారు. అలాగే కంపెనీ ఈ కిట్‌ను బ్యాటరీ లేకుండా అయితే రూ. 35,000 ఇంకా బ్యాటరీ ప్యాక్‌తో కలిపి అయితే రూ. 95,000 ధరతో పరిచయం చేసింది.



ఇక జిఎస్టీతో కనుక కలుపుకుంటే, గోగో ఏ1 తయారు చేసిన ఎల‌క్ట్రిక్ కన్వ‌ర్ష‌న్ కిట్ ధ‌ర వచ్చేసి రూ.44,486 గా ఉంది. కాగా ఓన్లీ బ్యాట‌రీ ప్యాక్ ధ‌ర మాత్రమే రూ.55,606 ఉంది. అంటే, మీ వ‌ద్ద ఉన్న పాత హీరో స్ప్లెండర్ బైక్‌ను మీరు ఎల‌క్ట్రిక్ బైక్‌గా మార్చుకోవాలంటే అందుకు దాదాపుగా రూ.1 ల‌క్ష పైనే ఖర్చు అనేది అవుతుంది. అయితే, ఇలా పెట్రోల్ బైక్‌ను ఈవీ బైక్ గా మార్చుకోవడం వలన తరచూ పెట్రోల్ కొట్టించాల్సిన అవసరం లేదు. ఇంధ‌నం ఖ‌ర్చు కూడా పూర్తిగా జీరో అవుతుంది. కాబట్టి, దీనిపై ఎక్కువగా ఖ‌ర్చు చేసినప్పటికీ, ఇది లైఫ్ లాంగ్ ఎక్కువ ప్ర‌యోజ‌నాలను అందిస్తుంది.ఇక సాధారణంగా చెప్పాలంటే అసలు పెట్రోల్ ఇంధనంతో నడిచే మోటార్‌సైకిళ్లను ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లుగా మార్చకూడదు. అలా చేయాలంటే, ఆర్టీఓ ఆఫీస్ నుండి లేదా సంబందిత ఏజెన్సీల నుండి ఖచ్చితంగా తగిన అనుమతులు అనేవి తీసుకోవాలి. ఈ నేపథ్యంలో, గోగో ఏ1 తమ హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్ కోసం ఇప్పుడు ఏఆర్ఏఐ వెరిఫికేషన్ కూడా పొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: