ప్రముఖ చైనీస్ మొబైల్ తయారీ సంస్థ వన్ ప్లస్ ఫ్లాగ్ షిప్ స్పెసిఫికేషన్ లతోపాటు బెస్ట్ మొబైల్ ఫోన్స్ ను రిలీజ్ చేయడం జరుగుతోంది. ఇక బడ్జెట్ ఫోన్లను కూడా రిలీజ్ చేస్తూ బాగా పాపులర్ అవుతోంది వన్ ప్లస్. ఏప్రిల్ 28వ తేదీన వన్ ప్లస్ 10 ఆర్ 5 జి , వన్ ప్లస్ నార్డ్ సీ ఈ 2 లైట్ అనే రెండు కొత్త మొబైల్స్ ను ప్లాన్ చేస్తున్నట్లు వన్ ప్లస్ తాజాగా ప్రకటించడం జరిగింది. అలాగే కొత్త వైర్లెస్ ఇయర్ బడ్స్ ను కూడా ఏప్రిల్ 28వ తేదీన ఇండియా మార్కెట్ లో లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించడం గమనార్హం. అయితే విడుదలకు ముందే వన్ ప్లస్..వన్ ప్లస్ 10 ఆర్ 5 జి , వన్ ప్లస్ నార్డ్ సీ ఈ 2 లైట్ ఈ రెండు మోడల్స్ స్పెసిఫికేషన్స్ టీజ్ చేస్తూ కస్టమర్లలో హైప్ పెంచుతోంది వన్ ప్లస్ కంపెనీ. ఇక ఈ రెండు స్మార్ట్ ఫోన్ ల ఫీచర్స్ ఏంటో ఒకసారి చదివి తెలుసుకుందాం.

వన్ ప్లస్ 10 ఆర్ 5 జి ఫీచర్స్ విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ త్రిపుల్ కెమెరా సెట్ అప్ ఉంటుంది అని స్పష్టం చేశారు . న్యూ డిజైన్ తో వచ్చే ఈ ఫోన్ బ్లాక్ , బ్లూ  కలర్ ఆప్షన్ లో రానున్నట్లు సమాచారం. కానీ ఇందులో వన్ ప్లస్ స్లైడర్ ఉండదు. కేవలం కిందిభాగంలో యూ ఎస్ బి టైప్ సీ పోర్టు, కుడివైపు పవర్ బటన్ మాత్రమే ఉంటుంది. ఇది  150 వ్యాట్ సూపర్ VOOC ఛార్జింగ్ ను  సపోర్ట్ చేస్తుంది. ఇక మీడియా టెక్ డైమన్సిటీ 8100 మాక్స్ ప్రాసెసర్ సహాయంతో రెండు అవుతుందని కంపెనీ తెలిపింది.

వన్ ప్లస్ నార్డ్ సీ ఈ 2 లైట్ స్మార్ట్ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో మనకు లభిస్తుంది. ఇది కూడా ట్రిపుల్ కెమెరా సెట్ అప్ తో పాటు అధిక రిఫ్రెష్ రేటుతో కూడా ఉండవచ్చని అంచనా . కేవలం రూ.20 వేల లోపు మాత్రమే ధర ఉంటుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: