కొత్త కార్లు మాదిరిగానే సెకండ్ హ్యాండిల్ వాహనాలను కూడా ఇప్పుడు ఎక్కువగా కొంటున్నారు ప్రజలు. ఆఫ్లైన్ మార్కెట్లో కాకుండానే ఆన్లైన్లో కూడా ఇవి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. చాలా సెకండ్ హ్యాండ్ కార్లు మంచి కండీషన్లో ఉంటాయి.. అంతే కాకుండా మంచి ఫీచర్లతో సరైన ధరలతో లభిస్తున్నాయి. అయితే సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని అంశాలను ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. లేదంటే మోసం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం.


1). సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసే ముందు ఆ వాహనం యొక్క పేపర్లను తనిఖీ చేయడం మంచిది.. చాసిస్, ఇంజన్ నెంబర్లలో ఒకసారి చెక్ చేయాలి. ఇన్సూరెన్స్ పత్రాలను కూడా క్షుణ్నంగా పరిశీలించాలి. వీలైతే కార్ ప్రింటర్  లను కూడా చూడాల్సి ఉంటుంది.

2). కారు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి దాని యొక్క పెయింటింగ్, కండిషన్ మాత్రమే కాదు ఇంజన్ పని తీరులో కూడా తీసుకోవడం చాలా ముఖ్యమే.. అందుకే కారు ఇంజన్ ను కూడా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి.

3). కారు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి కారు బూట్ స్పేస్, బానెట్ ను ఓపెన్ చెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఎందుకంటే కారు ఏమైనా డ్యామేజ్ అయితే లోపల చూడడం ద్వారా మనకు తెలుస్తుంది.

4). కారు టైర్లను తీసుకునేటప్పుడు కచ్చితంగా ఒకసారి చూస్తూ ఉండాలి. తరచుగా సెకండ్ హ్యాండ్ కార్ లో చాలామంది సెకండ్ హ్యాండ్ కార్ల ను మారుస్తు ఉంటారు.. ఎందుచేతనంటే కొత్త టైర్ల కోసం దాదాపు కూడా రూ.20 వేలు రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.

5). సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసే ముందు అది పాతదా కాదా అనేది చూసుకోవాలి. ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంతే కాదు కొన్ని కిలోమీటర్లు నడపడం ముఖ్యం. కారును 100 వేగం స్పీడుతో  నడపాలని గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఏదైనా సమస్య ఉంటే బయట పడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: