ఇది వినియోగదారులకు అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంటుందని కంపెనీ అంటోంది. డీప్ బ్లూ, కూల్ గ్రే ,చార్కోల్ బ్లాక్, అనే మూడు కలర్స్ లో ఈ వాచ్ ఇపుడు అందుబాటులో ఉంది. దీని ధర రూ. 2,499. స్మార్ట్ వాచ్ ఈ రోజు నుండి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో రానుంది. కాగా ఈ కొత్త స్మార్ట్ వాచ్ యొక్క ప్రాముఖ్యత ను గురించి ఇపుడు ఓ లుక్కేద్దాం పదండి.
boAt Wave Connect స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి.
*1.69 ఇంచుల హెచ్‌డీ డిస్‌ప్లే ని కలిగి ఉంది.
* ఈ స్మార్ట్‌వాచ్ నుండి నేరుగా ఇన్కమింగ్ కాల్స్ అలాగే ఔట్గోయింగ్ కాల్స్ రెండు చేసుకోవచ్చు.
* 60 కు మించి అధికంగా స్పోర్ట్స్ మోడ్‌లు.. రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, డ్యాన్స్ లు మొదలగునవి ఉన్నవి.
* హార్ట్ రేట్ సెన్సార్, SpO2 మానిటర్, స్ట్రెస్ లెవెల్ ట్రాకర్ కూడా ఉంది.
* వాటర్, డస్ట్ రెసిస్టెంట్ కోసం IP68 రేటింగ్ ను కలిగి ఉంది.
* డయల్ ప్యాడ్ ఫీచర్, ఈ వాచ్‌లో 20 వరకు కాంటాక్ట్స్ సేవ్ చేసుకునే వీలు ఉంది.
* బ్లూటూత్ 5.1, మ్యూజిక్ కంట్రోల్ గా ఉంది.
* మెసేజ్‌లు, నోటిఫికేషన్లను వాచ్‌లోనే చూసుకోవచ్చు.
* అలెక్స్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంది.
* 300mAh బ్యాటరీ సామర్థ్యం.
* బ్లూటూత్ కాలింగ్ లేకుండా ఏడు రోజుల వరకు, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో రెండు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది.
ఇవన్నీ చూస్తే కస్టమర్ తప్పక ఆకర్షితుడు అవ్వాల్సిందే అంటున్నారు. మరి ఈ కొత్త స్మార్ట్ వాచ్ ఏ స్థాయిలో పాపులర్ అవుతుంది అన్నది చూడాలి.