భారతదేశంలో ఎలక్ట్రిక్ బైక్ లు ,స్కూటీలు బాగా పెరిగి పోతూనే ఉన్నాయి. దేశంలో సరికొత్త EV స్టార్టప్ కంపెనీ అయిన స్పీచ్ మోటోకార్ప్ కూడా ఒక ఎలక్ట్రిక్ బైక్ విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. నివేదికల ప్రకారం కంపెనీ మొదటి ఈ బైక్..CSR-762 బైకు త్వరలోనే విడుదలవుతోంది. రాబోయే బైక్ గరిష్టంగా 120KMPH వేగాన్ని కలిగి ఉండును. అయితే ఇది ఒక్కసారి చార్జింగ్ చేస్తే చాలు..110 KM సర్టిఫైడ్ పరిధిని కూడా కలిగి ఉండును. ఈ బైక్ ధర ను రూ.1.65 లక్షలు ఎక్స్ షోరూం గా నిర్ణయించడం జరిగింది.ఈ బైక్ పై రూ.40,000 వరకు సబ్సిడీ అందిస్తోంది. CSR 762 బైక్ స్పెసిఫికేషన్స్ ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

స్విచ్ మోటో కార్ప్ మొదటి ఈ బైక్ రూపకల్పన గుజరాత్లో ప్రారంభం జరిగింది. ఇందులో 3.7 KWH లిథియం అయాన్ బ్యాటరీ ని అందిస్తోంది. ఈ బ్యాటరీని మనం మార్చుకోవచ్చు కూడా. ఇక మన ప్రయాణాలను బట్టి కంబైన్డ్ చార్జింగ్ సిస్టమ్(CCS) బ్యాటరీ చార్జర్ తో కూడా చాట్ చేసుకునే విధంగా తయారు చేయబడింది. త్వరలో విడుదల కాబోయే బైక్ స్పోర్ట్స్ రివర్స్ పార్కింగ్ మోడల్ కూడా రానుంది. ఈ బైక్ లో సెంట్రల్ డ్రైవ్ సిస్టమ్ ను కూడా పొందుపరిచారు. TFT కలర్ డిస్ప్లే కలదు.


త్వరలో విడుదలయ్యే ఈ బైక్ తరఫునుంచి రాజకుమార్ పటేల్ మాట్లాడుతూ..CSR 762 బైక్ ను విడుదల చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని భారతీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ బైక్ ను డిజైన్ చేశామని.. అలాంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయని దీనిని తయారు చేయడానికి రెండేళ్లు శ్రమించామని  తెలిపారు. ఇవి భారతదేశంలో 15 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ బైక్స్ డీలర్ షిప్ ను షో రూమ్లతో ఒప్పందం కుదుర్చుకుందని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: