ఇక సాధారణంగా ఫేస్‌బుక్  వాడే యూజర్లు మెసెంజర్ ద్వారా తమ బంధుమిత్రులకు మెసేజ్‌లు పంపుతుంటారు. కాల్స్ చేసుకోవడానికి వీలుగా ఇందులో కాలింగ్ ఫీచర్‌ అనేది కూడా అందుబాటులో ఉంది.అయితే మెసెంజర్‌ను కూడా వాట్సాప్ లాగా మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దేందుకు మెటా సంస్థ సరికొత్త ఫీచర్లను కూడా లాంచ్ చేస్తోంది.తాజాగా మెసెంజర్ ద్వారా ఈజీగా కాల్స్‌ చేసుకునేందుకు కొత్త కాల్స్  ట్యాబ్ ఫీచర్‌ను కూడా పరిచయం చేస్తోంది. మొదటగా కొంతమంది సెలెక్టెడ్ యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇక ఈ ట్యాబ్ మెసెంజర్ యాప్‌లోని చాట్ పేజీలో కింద కనిపిస్తుంది. అలాగే కాల్స్  అని కొత్తగా కనిపించే ఈ ట్యాబ్‌పై క్లిక్ చేయడం ద్వారా ఈజీగా కాల్స్ చేసుకోవచ్చు.ఇక అంతేకాదు, కొత్త ట్యాబ్‌పై క్లిక్ చేస్తే... ఇన్‌కమింగ్ కాల్స్ లేదా ఔట్‌గోయింగ్ కాల్స్ హిస్టరీ కూడా ఒకే చోట కనిపిస్తుంది. ఇక్కడ ఒక ట్యాప్‌తో కాల్స్‌ కనెక్ట్ చేయడం కూడా వీలవుతుంది. దీనర్థం వాట్సాప్‌లో కాల్స్ ట్యాబ్‌పై క్లిక్ చేస్తే ఎలా కాల్ హిస్టరీ కనిపిస్తుందో అలాగే మెసెంజర్‌లో కూడా మీకు కనిపిస్తుంది. ఈ ఫంక్షన్ యాప్ స్క్రీన్ దిగువ భాగంలో పీపుల్ (People),ఇంకా చాట్స్‌ (Chats) ట్యాబ్‌ల మధ్య ఉంది. దశలవారీగా రిలీజ్ అవుతున్న ఈ అప్‌డేట్ త్వరలోనే ఆండ్రాయిడ్ (Android) ఇంకా ఐఓఎస్ (iOS) యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.


ఇక మెటా వివరణ ప్రకారం, ఈ చాట్ విండో ద్వారా వీడియో, ఆడియో కాల్స్‌ గణనీయంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ మెయిన్ స్క్రీన్‌లో కాల్స్‌ కోసం ఓ ఫీచర్‌ని కూడా మెటా లాంచ్ చేసింది. ఈ యాప్‌లో ఎవరికైనా కాల్ చేయడానికి, యూజర్లు ఒక ఐడీని వాట్సాప్‌లో లాగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా అక్కడ కనిపించిన కాంటాక్ట్స్‌ పక్కనే ఉన్న వీడియో లేదా ఆడియో అనే బటన్స్‌పై నొక్కి కాల్ కూడా చేసుకోవచ్చు. ఇక ఈ అప్‌డేట్‌ వల్ల మెసెంజర్‌లో కాల్‌లను మరింత యాక్సెస్ చేయడం కూడా సాధ్యమవుతుంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లను కాల్స్ ఎక్కువగా చేసేలా కూడా ప్రోత్సహించినట్లు అవుతుంది.ఇక గణాంకాల ప్రకారం 2020కి ముందు కంటే ఇప్పుడు 40 శాతం ఫేస్‌బుక్‌ని ఉపయోగిస్తున్నారు. కోవిడ్-19 వైరస్ తరువాత చాలా కంపెనీలు, ఉద్యోగులను సమావేశాలను నిర్వహించడానికి వీడియో కాలింగ్ ఫెసిలిటీ ఉన్న యాప్స్‌ను ఎక్కువగా వాడటం ప్రారంభించడం జరిగింది. ఇక ఈ క్రమంలో మెసెంజర్ యాప్ కూడా బెస్ట్ చాయిస్ అయింది. అలా ప్రస్తుతం ప్రతి రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెసెంజర్ యూజర్లు 300 మిలియన్లకు పైగా వాయిస్ ఇంకా వీడియో కాల్‌లు చేస్తున్నారు. ఈ సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: