ఉమ్మడి వరంగల్‌కి చెందిన ప్రముఖ తెలుగు సైంటిస్ట్‌ డాక్టర్‌ సాంబారెడ్డికి అరుదైన గౌరవం లభించింది. అమెరికా దేశానికి చెందిన ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ తాజాగా ప్రకటించిన ప్రకటించిన టాప్‌ సైంటిస్టుల జాబితాలో ఆయనకు చోటు దక్కింది.ఇక ప్రస్తుతం ఆయన టెక్సాస్‌లోని ఏ ఏండ్‌ ఎం యూనివర్సిటీ కాలేజ్‌ ఆప్‌ మెడిసన్‌లో ఓ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రొలిఫిక్‌ మెడికల్‌ ఇన్వెంటర్‌ ఇంకా అలాగే మంచి ఫార్మా రీసెర్చర్‌గా గుర్తింపు పొందారు.అలాగే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పరకాల మండలం చర్లపల్లిలో డాక్టర్‌ దూదిపాల సాంబారెడ్డి జన్మించారు.ఇక ఆ తర్వాత కాకతీయ వర్సిటీలో ఫార్మాసీ విద్యాను పూర్తి చేసి మంచి ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అలాగే ఫార్మా రంగంలో ఆనేక ఆవిష్కరణలను ఆయన చేశారు. ఇంకా న్యూరోథెరాప్యూటిక్స్‌లో ఆయన గ్లోబల్‌ లీడర్‌గా కూడా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా 215 సైంటిఫిక్‌ పేపర్లను ప్రచురించగా 100 మందికి పైగా స్కాలర్లకు గైడ్‌గా వ్యవహరించారు.


ఇక అంతేకాదు 400ల వరకు ప్రెజెంటేషన్లకు ఆయన సహాకారం అందించారు.ఇంకా న్యూరోథెరాప్యూటిక్స్‌లో విభాగంలో విశేష కృషి చేసిన డాక్టర్‌ సాంబారెడ్డి బ్రెయిన్‌ డిసార్డర్లకు న్యూరో స్టెరాయిడ్‌ థెరపీని కూడా అభివృద్ధి చేశారు. అలాగే మెదడు సంబంధిత వ్యాధులకు సంబంధించిన చికిత్సను మెరుగుపరచడంలో ఈ న్యూరో స్టెరాయిడ్‌ థెరపీ ఎంతగానో ఉపకరించింది.ఇంకా పోస్టపార్టమ్‌ డిప్రెషన్‌కి సంబంధించి డాక్టర్‌ సాంబారెడ్డి అభివృద్ధి చేసిన బ్రెక్సానోలెన్‌ ఔషధం అమెరికా తరఫున ఎఫ్‌డీఏ అనుమతి పొందిన తొలి మెడిసిన్‌గా కూడా గుర్తింపు పొందింది.ఇంకా అలాగే అదే విధంగా ఎపిలెప్పీకి సంబంధించి గానాక్సోలోన్‌ కూడా ఉంది. ఇంకా న్యూరో సంబంధిత విభాగంలో చేసిన కృషికి గాను డాక్టర్‌ సాంబారెడ్డికి అనేక అవార్డులు కూడా వరించాయి.ఇది నిజంగా తెలుగు వాళ్లకి గర్వ కారణం అనే చెప్పారు. ఒక తెలుగు భారతీయ శాస్త్రవేత్త ఇలా ప్రపంచవ్యాప్తంగా ఈరోజుల్లో మంచి గుర్తింపు పొందడం చాలా గొప్ప విషయం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: