ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ కు రోజుకు రోజుకు విపరీతమైన క్రేజ్ పెరుగుతుంది. కొన్ని సార్లు డేటా చోరీకి గురైన కూడా వాట్సాప్ పూర్తీ భద్రతా చర్యలను ఏర్పాటు చేసింది...తాజాగా యూజర్‌ ప్రైవసీ కోసం వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. దీంతోపాటు మెసేజ్‌ రియాక్షన్‌కు కొత్తగా మరిన్ని ఎమోజీలను జోడించడంతోపాటు మరో మూడు కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేయనుంది. మరి వాట్సాప్‌ తీసుకొస్తున్న కొత్త ఫీచర్లేంటి.. వాటితో యూజర్లకు ఎలాంటి సేవలు అందుబాటులోకి వస్తాయో తెలుసుకుందాం...


గోప్యంగా ఆన్‌లైన్‌ స్టేటస్‌..


ఛాట్‌ పేజీలో యూజర్‌ ఐకాన్‌ కింద ఆన్‌లైన్‌ స్టేటస్‌ ద్వారా యూజర్‌ ఆన్‌లైన్‌లో ఉన్నారా? ఆఫ్‌లైన్‌లో ఉన్నారా? అనేది తెలుస్తుంది. అక్కడ స్టేటస్‌ ఆన్‌లైన్‌ అని చూపిస్తే, యూజర్‌ ఆన్‌లైన్‌లో ఉన్నట్లు. ఒకవేళ ఆన్‌లైన్‌ అని చూపించకుంటే ఆఫ్‌లైన్‌లో ఉన్నట్లుగా భావించాలి. వాట్సాప్‌ తాజాగా తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో యూజర్లు ఈ స్టేటస్‌ కూడా ఇతరులకు కనబడకుండా చేయొచ్చు. అంటే ఆన్‌లైన్‌లో ఉన్నట్లు అవతలి వారికి తెలియదు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉందని, ఇందులో రెండు ఆప్షన్లు యూజర్లు అందబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో తెలిపింది.


మరిన్ని ఎమోజీలతో మెసేజ్‌ రియాక్షన్‌..


ఇటీవలే మెసేజ్‌ రియాక్షన్‌ ఫీచర్‌ను వాట్సాప్ యూజర్లకు పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో యూజర్లు ఏదైనా మెసేజ్‌కు ఎమోజీలతో రిప్లై ఇవ్వొచ్చు. ఇందులో మొత్తం ఆరు ఎమోజీలుంటాయి. ఇప్పుడు వీటికి అదనంగా వాట్సాప్‌లోని అన్ని ఎమోజీలను ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించనుంది. ఇందుకోసం యూజర్‌ మెసేజ్‌ పక్కనే ఉన్న ఎమోజీ ఆప్షన్‌పై క్లిక్ చేసిన వెంటనే ఆరు ఎమోజీలతోపాటు ప్లస్‌ సింబల్‌ ఉంటుంది. దానిపై క్లిక్‌ చేస్తే వాట్సాప్‌లోని అన్ని ఎమోజీలు కనిపిస్తాయి.


ఫ్లాష్‌కాల్‌తో వెరిఫికేషన్‌..


వాట్సాప్‌లో లాగిన్‌ అయ్యే సందర్భంలో మొబైల్‌ నంబర్‌ వెరిఫికేషన్‌ తప్పనిసరి. ఇందుకోసం మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఆరు అంకెల వెరిఫికేషన్‌ కోడ్‌ను వాట్సాప్‌ యాప్‌లో ఎంటర్‌ చేయాలి. ఇకమీదట వెరిఫికేషన్‌ కోడ్‌ స్థానంలో ఫ్లాష్‌కాల్స్‌ అనే కొత్త పద్ధతిని వాట్సాప్‌ పరిచయం చేయనుంది. దీంతో యూజర్లు కోడ్‌ నమోదు చేయకుండా ఆటోమేటిగ్గా ఫ్లాష్‌కాల్స్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేస్తాయి. ఈ ఫ్లాష్‌కాల్స్‌ ఫీచర్‌ ద్వారా వెరిఫికేషన్ ప్రక్రియ జరగాలంటే యూజర్లు ఫోన్‌ కాల్‌ హిస్టరీ, లొకేషన్‌, ఎస్సెమ్మెస్‌లను యాక్సెస్‌ చేసేందుకు వాట్సాప్‌ను అనుమతించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.


బిజినెస్‌ ఖాతాలకు ప్రీమియం ప్యాకేజ్‌..


బిజినెస్ ఖాతాదారుల కోసం వాట్సాప్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. సాధారణ ఖాతాలకు భిన్నంగా ప్రీమియం యూజర్లకు కొన్ని అదనపు ఫీచర్లు అందుబాటులోకి వస్తాయట. దీంతో బిజినెస్‌ ఖాతాదారులు ఒకేసారి 10 డివైజ్‌లలో వాట్సాప్‌ను లాగిన్‌ చేయొచ్చు. అలానే బిజినెస్‌ అవసరాలకు సంబంధించి ఫోన్‌ నంబర్‌తో కూడిన షార్ట్‌ లింక్‌ను సులువుగా క్రియేట్‌ చేసి ఇతరులతో షేర్‌ చేసుకోవచ్చని వాబీటాఇన్ఫో తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ కూడా పరీక్షల దశలో ఉందని, త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి రానుందని సమాచారం.


మీడియా ఎడిటర్‌లో కొత్త ఆప్షన్‌..


వాట్సాప్‌లో ఏదైనా ఫొటో షేర్‌ చేసే ముందు అందులో చిన్న చిన్న మార్పులు చేసుకునేందుకు వీలుగా మీడియా ఎడిటర్‌ ఆప్షన్‌ ఉంది. దీంతో యూజర్లు ఫొటోను క్రాప్‌, రొటేట్‌ చేయడంతోపాటు టెక్ట్స్‌, ఎమోజీ, స్టిక్కర్లు యాడ్‌ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటికి అదనంగా బ్లర్‌ టూల్‌ యూజర్లకు అందుబాటులోకి రానుంది. దీంతో యూజర్లు ఫొటోలో ఏదైనా ప్రాంతాన్ని బ్లర్‌ చేసి ఇతరులకు పంపొచ్చు.. అతి తర్వలొ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: