1. రూ.719 జియో ప్లాన్:
84 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ మీకు లభిస్తుంది. ఇక ప్రతిరోజు 2gb చొప్పున 84 రోజులపాటు 168 జిబి డేటాను పొందవచ్చు. ఇక అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందే అవకాశం ఉంటుంది. ఇక ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పొందడంతో పాటు జియో టీవీ, జియో సెక్యూరిటీ , జియో సినిమా, జియో క్లౌడ్, జియో మ్యూజిక్ లాంటి జియో యాప్స్ అన్ని ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందే అవకాశం ఉంటుంది.
2. రూ.2,999 జియో ప్లాన్:
ఈ ప్లాన్ మీకు ఒక ఏడాది పాటు పూర్తి వ్యాలిడిటీతో లభిస్తుంది. అంతేకాదు ప్రతిరోజు 2.5జిబి డేటాను వాడుకోవచ్చు ఇక మొత్తం ఏడాదికిగాను 912.5 జిబి డేటా మీకు పూర్తిగా లభిస్తుంది. అంతేకాదు ఒక ఏడాది పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ కూడా ఉచితంగా పొందవచ్చు. ఇక ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లతో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉంటుంది. అలాగే జియో ఆప్ లను అన్నింటినీ కూడా మీరు ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందే అవకాశం కల్పించారు.
3. రూ.666 జియో ప్లాన్:
84 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ తో మీరు ప్రతిరోజు 1.5 జిబి డేటాను ఉచితంగా పొందవచ్చు. అంటే మొత్తం 126 జీబీ డేటా పొందే అవకాశం ఉంటుంది . ఇక అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పొందవచ్చు. అలాగే జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ లాంటి జియో ఆప్ లను ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.