చాలామందికి కూడా ప్రవహించే నీళ్లపై ఎలా వంతెనను నిర్మిస్తారని సందేహం చాలా సార్లు వచ్చే ఉంటుంది. ఇక కింద అలా నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు భూభాగం లేని చోట వంతెనను కట్టడం మళ్ళీ దానికోసం పిల్లర్లను ఎలా కట్టడం సాధ్యమవుతుంది అని ఇలా చాలామందికి కూడా డౌట్స్ అనేవి చాలా సార్లు వస్తూ ఉంటాయి.అయితే నీటి స్థాయి ఇంకా నేల నాణ్యతను బట్టి వివిధ పద్ధతుల ద్వారా నీటిపై వంతెనలను నిర్మిస్తారట. దీని కోసం ఇంజనీర్లు ఎంతో కష్టపడి సరైన ఆలోచనలతో మంచి చక్కటి వ్యూహంతో వంతెనలను నిర్మిస్తారు.. మొదటి పద్ధతిలో తక్కువ లోతు నీటిలో వారు వంతెనలను నిర్మిస్తారు. తక్కువ లోతు నీటిలో వంతెన పునాదిని తాత్కాలికంగా ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని పూరించడం ద్వారా వేయబడుతుంది. దీనిపై ఇక స్తంభాలను నిర్మించేస్తారు.అయితే నీటి అడుగున ఉన్న పొర అనేది పలుచగా ఉన్నప్పుడు తాత్కాలికంగా రిగ్గులను ఏర్పాటు చేసి నది గర్భం లో లోతుగా పిల్లర్లను వారు నిర్మిస్తారు. అప్పుడు వంతెనను ఇప్పటికే నిర్మించిన పిల్లర్ సపోర్ట్ తో టెంపరరీ ప్లాట్ ఫారం లేదా బాధితుల ద్వారా బ్యార్జ్ లో ద్వారా కూడా నిర్మించవచ్చు. ఇక రెండో రెండవ పద్ధతి విషయానికి వస్తే లోతైన నీటిపై వంతెనను నిర్మించడం. ఇలాంటిది నిర్మించేటప్పుడు కాపర్ డ్యాం టెక్నిక్ ను ఉపయోగిస్తారు. ఈ పద్ధతి ద్వారా నీటి లోపల ఒక ప్రదేశాన్ని చుట్టుముట్టి,ఇంకా గోడను నిర్మించి ఆ ప్రదేశం నుండి నీటిని బయటకు పంపించేస్తారు.


ఇక ఆ తర్వాత కాఫర్ డ్యాం లోపల వంతెన పునాది కూడా నిర్మించబడుతుంది. ఈ పద్ధతి ఎక్కువగా నదులు ఇంకా అలాగే సముద్రాలపై ఉపయోగిస్తారు. వీటిల్లో నీటి ప్రవాహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.కాబట్టి పని పూర్తి అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇంకా ఈ రెండు కాకుండా మరొక పద్ధతి కూడా ఉంది. ఈ టెక్నాలజీకి కేసు డ్రిల్లింగ్ అని పేరు. ఇది మంచి మోడ్రన్ టెక్నిక్.ఇక ఈ టెక్నిక్ లో వాటర్ టైట్ చాంబర్ గాలి ఒత్తిడి సహాయంతో నీటిని దూరంగా ఉంచుతుంది. అప్పుడు ఛాంబర్ లోపల ఉన్న ఒక మూసి ఉన్న ట్యూబ్ చాంబర్ అనేది అమర్చబడుతుంది. ఆ తర్వాత ట్యూబ్ లోపల సుదీర్ఘ డ్రీం కూడా ఉంచబడుతుంది.అప్పుడు డ్రిల్లింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఇక ఈ ప్రక్రియలో నిండిన నీరు బయటకు పంపబడుతుంది. ఆ తరువాత అదనపు మద్దతు ఇవ్వడానికి లోపల డ్రిల్లింగ్ చేయబడిన రంధ్రంలోకి ఒక కేసును కూడా పంపిస్తారు. ఈ విధంగా స్థిరమైన ఫ్రేమ్ అనేది సృష్టించబడుతుంది. ఇలా వంతెన నీటిపై వంతెనలను ఈజీగా నిర్మిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: