ప్రముఖ బ్రాండెడ్ కలిగిన శాంసంగ్ తాజాగా A04 గెలాక్సీ మొబైల్ ని విడుదల చేయబోతున్నట్లు వెబ్సైట్లో తెలియజేసినట్లు సమాచారం. SM -A042F మోడల్ నెంబర్ తో ఈ మొబైల్ ని ఆన్లైన్లో విడుదల చేయబోతున్నారు. ఈ మొబైల్ 3GB ర్యామ్ ను కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ యొక్క పూర్తి వివరాలు తాజాగా లీక్ అవడం జరిగింది వాటి గురించి చూద్దాం.


ఈ మొబైల్ ఆండ్రాయిడ్ -12  ఆధారంగా పనిచేస్తుందట. ఇక ఈ మొబైల్ యొక్క ప్రాసెస్ మీడియా టెక్ హీలియో G-35  ప్రాసెస్ ఉండబోతోంది అన్నట్లుగా తెలుస్తున్నది. గతంలో కూడా ఈ మొబైల్ కు సంబంధించి కొన్ని ఫోటోలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. దీని ధర కూడా రూ. 10,000 లోపు ఉన్నట్లు సమాచారం. ఇక గతంలో విడుదలైన గెలాక్సీ A03 మొబైల్ తర్వాత ఈ మొబైల్ ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. A04 మొబైల్  ఫోన్ లో  ఇన్ఫినిటీ-V డిస్ప్లే ఉండనున్నట్లు తెలుస్తున్నది. ఈ మొబైల్ మూడు కలర్లలో విడుదల కారణాలు అవుతోంది. ఈ శాంసంగ్ మొబైల్ అత్యంత చౌకైనా 5g మొబైల్ గా ఉండబోతున్నట్లు సమాచారం.

 తాజాగా గత కొద్దిరోజుల క్రితం..M-13 5జి మొబైల్ విడుదలైంది ఈ మొబైల్ అమెజాన్ లో తీసుకోవచ్చు. 4GB RAM+64GB స్టోరేజ్ మెమొరీ గల మొబైల్ ధర రూ.13,999గా ఉండబోతోంది. టాప్ అండ్ వేరియంట్ కలిగిన మరొక మొబైల్ ధర రూ.15,999 రూపాయలు ఉండనంది. ఈ మొబైల్ కూడా ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుంది. ఇక డిస్ప్లే విషయానికొస్తే 6.5 అంగుళాల హెచ్డి డిస్ప్లే అందుబాటులో ఉన్నది. ఇక ఈ మొబైల్లో 128 జీబీ వరకు మెమోరీ తో  ఎక్స్ట్రా స్టోరేజ్ చేసుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే మెయిన్ కెమెరా 50 mp కాగా.. సెల్ఫీ ప్రియుల కోసం -5  మెగాపిక్సల్ కెమెరా కలదు. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ 15W చార్జింగ్ సపోర్ట్ చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: