దేశంలో టెక్ దిగ్గజమైన ఇన్ఫినిక్స్ తాజాగా బడ్జెట్ ధరలో స్మార్ట్ఫోన్లను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇన్ఫినిక్స్ హాట్ 12 పేరుతో మరో సరికొత్త మోడల్ భారత మార్కెట్లోకి కంపెనీ పరిచయం చేసింది. ఇది 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ మరియు ప్రీమియర్ ఫీచర్లను కలిగే ఉండడం గమనార్హం. ఇక ఇతర స్మార్ట్ ఫోన్ల మాదిరిగానే ఈ స్మార్ట్ ఫోన్ కూడా మీకు ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచారు. ఇప్పుడు ఈ కొత్త మోడల్ మొబైల్ యొక్క ఫీచర్లు, స్పెసిఫికేషన్ లు, ధరలు ఇలా ప్రతి విషయాన్ని మనం చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


Infinix Hot 12.. భారత మార్కెట్లో 6 GB ర్యామ్+64 GB స్టోరేజ్ వేరియంట్ తో రూ.9,499 ధరకే లభిస్తోంది. ఇక ఆగస్టు 23వ తేదీ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కొనుగోలుదారులు ఎక్స్ ప్లోరేటరీ బ్లూ , పోలార్ బ్లాక్, పర్పుల్ అలాగే టర్క్కోయిస్ సియాన్ కలర్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. 90 Hz రిఫ్రెష్ రేటుతో 6.82 అంగుళాల హెచ్డి ఎల్సిడి ప్యానెల్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కు మనీకైనా డబుల్ ఫ్లాగ్ ఎడ్జ్ డిజైన్ ని కూడా తీసుకొచ్చారు.


మీడియా టెక్ హీలియో G85 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది.  అంతేకాకుండా 4GB ర్యామ్ ను అందిస్తున్న నేపథ్యంలో 3GB వరకు పొడిగించుకోవచ్చు. 7 జి బి వరకు రామ్ లభిస్తుంది. ఇక బ్యాక్ సైడ్ లో మొబైల్ కి క్వాడ్ ఎల్ఈడి ఫ్లాష్ తో 50 ఎంపీ AI ప్రైమరీ కెమెరాతో పాటు ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ను ఇస్తున్నారు. మిగతా రెండు కెమెరాలలో ఒకటి 2MP సెకండరీ షూటర్ సెల్ఫీ కోసం 8 ఎంపీ కెమెరా కూడా అమరచబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: