5G టెక్నాలజీ: త్వరలో దేశంలో అన్ని ప్రదేశాలకు కూడా 5g టెక్నాలజీ అనేది రాబోతోంది. ఇందు కోసం పలు టెలికాం కంపెనీలు పోటీ పోటీగా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.త్వరలో దేశంలో 5జీ నెట్‌ వర్క్‌ అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే పలు స్మార్ట్‌ఫోన్‌లు కూడా 5జీ వచ్చాయి. కంపెనీలు 5జీ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇక టెలికాం రంగంలో దూకుడు ప్రదర్శిస్తున్న రిలయన్స్‌ జియో కూడా 5g సేవలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అక్టోబర్ నుండి దేశంలో 5g మొబైల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయమై కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ అక్టోబర్ నాటికి 5g మొబైల్ సేవను ప్రారంభిస్తామని, ఆ తర్వాత దేశంలోని అన్ని పెద్ద, చిన్న నగరాలకు ఈ సర్వీసులను విస్తరిస్తామని చెప్పారు. ఈ ప్రకటన తర్వాత దేశంలోని అనేక మొబైల్ తయారీదారుల మధ్య 5g మొబైల్‌లను మార్కెట్లోకి తీసుకురావడానికి పోటీ ప్రారంభమైంది. 


రిలయన్స్ జియో తన మొట్టమొదటి చౌకైన 5g స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.నివేదికల ప్రకారం.. ఈ 5g స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెలాఖరులో రిలయన్స్ కంపెనీ వార్షిక సాధారణ సమావేశం (AGM) ఆగస్టు 29 న ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దీంతో JioPhone 5g ఎంట్రీ-లెవల్ మోడల్ అయిన jio Phone-Next గత సంవత్సరం అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాటు త్వరలో జియో నుండి 5g సేవలు అందుబాటులోకి వస్తాయి.దేశంలో జియో కొత్త స్మార్ట్‌ఫోన్ ధర రూ. 10,000 ఉండనుంది. తద్వారా సామాన్యులకు సులభంగా అందుబాటులోకి వస్తుంది. 2021లో లాంచ్ చేసే సమయంలో JioPhone Next ధర రిటైల్‌లో రూ. 6,499 ఉంది.కాబట్టి తక్కువ ధరలో 5g స్మార్ట్ ఫోన్ కావాలనుకునేవారు ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: