నోకియా 2660 ఫ్లిప్ పేరుతో ఒక ఫోల్డింగ్ మొబైల్ ని నోకియా ఈ రోజున మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది.ఈ మొబైల్ ఇప్పటివరకు ఇలాంటి మోడల్ కలిగిన మొబైల్స్ అన్ని కూడా భారీ ధరకే కస్టమర్లకు దొరుకుతున్నాయి అయితే ఈ కొత్త ఫోన్ మాత్రం బడ్జెట్ ధరలలోనే అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మొబైల్ ఫీచర్లు ఏమిటి ధర ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మొబైల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాకుండా ప్రత్యేకమైన కామ్ ఆపరేటింగ్ సిస్టంతో తయారు చేయబడింది ఇందులో రెండు డిస్ప్లేలు కలవు. ఫ్లిప్ తెరిచినప్పుడు పై భాగంలో 2.8 అంగుళాల డిస్ప్లే కలదు. ఇక ఈ మొబైల్ మూసినప్పుడు ముందు భాగంలో 1.77 అంగుళాల స్మాల్ స్క్రీన్ కూడా అందిస్తున్నారు. ఈ మొబైల్ 4g నెట్వర్క్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే 1450 MAH సామర్థ్యం తో పాటు 2.75 వార్స్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ ధర విషయానికి వస్తే.. రూ.4500 రూపాయల వరకు ఉండవచ్చని టెక్నికులు తెలియజేస్తున్నారు. ఈ మొబైల్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే ఒక 7 గంటలు వాడుకోవచ్చు. ఇక ఫ్లాష్ లైట్ తో కూడిన కెమెరా రేడియో తదితర ఫీచర్లు కూడా కలవు.