రిలయన్స్ జియో తమ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు వినూత్నమైన రీఛార్జ్ ప్లాన్స్ ను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సామాన్యూలను కూడా దృష్టిలో పెట్టుకొని కేవలం రూ.200 లోపు లభించే రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రిలయన్స్ జియో అందిస్తున్న ఈ ప్లాన్స్ ద్వారా మీకు ప్రతిరోజు డేటా తో పాటు వాయిస్ కాలింగ్ కూడా పొందవచ్చు. ఇప్పటికే అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు తక్కువ ధరకు అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ ను కూడా జియో తీసుకురావడం జరిగింది. ఇక మీరు కూడా బడ్జెట్ ధరలో రీఛార్జ్ కావాలి అని అంటే ఇప్పుడు రిలయన్స్ జియో అందిస్తున్న ఆ ప్రీపెయిడ్ ప్లాన్ లిస్టు గురించి మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.


రూ.149 రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్:
ఈ ప్లాన్ మీకు 20 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ప్రతిరోజు 1 జీబీ డేటా లిమిట్ తో హై స్పీడ్ 4G డేటాను పొందవచ్చు. ఇక ఏ నెట్వర్క్ కైనా సరే అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందవచ్చు. ఇక తక్కువ ధరలో రీఛార్జ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్రీపెయిడ్ ప్లానని చెప్పవచ్చు.


రూ.179 రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్:
ఈ ప్లాన్ మీకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ను 24 రోజుల వ్యాలిడిటీతో అందిస్తుంది. ఇక ప్రతిరోజు 1 జీబీ డేటాను పొందడంతో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందే అవకాశం ఉంటుంది.


రూ.209 రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్:
ఈ ప్లాన్ మీకు 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. ఇక అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు ప్రతిరోజు 1 జీబీ డేటాను పొందుతారు. అలాగే 100 ఎస్ఎంఎస్లను కూడా ప్రతిరోజు పొందుతారు. మరి రిలయన్స్ జియో అందిస్తున్న తక్కువ బడ్జెట్లో లభించే ఈ రీఛార్జ్ ప్లాన్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: