వాట్సాప్: వావ్ మరో అదిరిపోయే సూపర్ ఫీచర్?
ప్రముఖ మెసేజ్ యాప్ వాట్సాప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ఈ యాప్ వాడుతున్నారు.ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌ ఏంటంటే టక్కున చెప్పే సమాధానం వాట్సాప్‌. అంతలా ఈ ఆన్లైన్ మెసేజింగ్ యాప్‌ యూజర్లను చాలా బాగా అట్రాక్ట్ చేసింది.ఇంకా చేస్తుంది కూడా.ప్రతి రోజూ కూడా ఏదో ఒక అప్‌డేట్‌తో యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను అందిస్తూ రోజురోజుకీ యూజర్లను పెంచుకుంటూ పోతోంది. ఇదిలా ఉంటే ఎన్ని రకాల ఫీచర్లను తీసుకొచ్చినా ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తికి మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. దీంతో ప్రతీ రోజూ గ్రూప్స్‌లో ఏదో ఒక తప్పుడు వార్తకు సంబంధించిన మెసేజ్‌లు వైరల్‌ అవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తికి అడ్డుకట్టవేయడానికి వాట్సాప్‌ మరో సాలిడ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది.


ఇక ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్‌లు గ్రూప్‌లో ఇతరులు పోస్ట్‌ చేసే మెసేజ్‌లను డిలీట్‌ చేసే అవకాశం లభించింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్‌ గ్రూప్స్‌లో సర్క్యూలేట్ అవుతోన్న మెసేజ్‌ తప్పుడు సమాచారం అని ఒకవేళ అడ్మిన్‌ భావిస్తే దానిని ఎవరికీ కనిపించకుండా చేసే పవర్స్‌ అడ్మిన్‌కు ఇచ్చారు. గ్రూప్‌ అడ్మిన్‌ సదరు మెసేజ్‌ను సెలక్ట్‌ చేసుకొని ‘డిలీట్‌ ఫర్‌ ఆల్‌’ చేస్తే ఆ మెసేజ్‌ ఎవరికీ కనిపించకుండా డిలీట్‌ అవుతుంది.ఇంకా ఇదిలా ఉంటే వాట్సాప్‌ గ్రూప్స్‌లో ఫేక్‌న్యూస్‌ వైరల్‌ అయితే దానికి అడ్మిన్‌ కూడా బాధ్యత వహించాల్సిన ఉంటుందని ఇప్పటికే చట్టం చెబుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి ఫీచర్‌ అందుబాటులోకి రావడంతో అడ్మిన్‌లకు వెసులుబాటు కల్పించినట్లైంది. గతకొన్ని రోజుల క్రితం బీటా వెర్షన్‌లో పరీక్షించిన ఈ ఫీచర్‌ను ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: