లేకపోతే ఆ మొబైల్లో వాట్సప్ సేవలను బంద్ చేయనున్నట్లు సమాచారం. ఇక అంతే కాకుండా పలు పాత మొబైల్స్ లో కూడా వాట్సాప్ సేవలను నిలిపివేయునున్నట్లు అధికారికంగా ప్రకటించింది వాట్సాప్ సంస్థ. అక్టోబర్ నెల నుంచి కొన్ని మొబైల్స్ లో వాట్సప్ సేవలు నిలిచిపోనున్నట్లు సమాచారం. డబ్ల్యూ ఏ బేటా ఇన్ఫో ప్రకారం.. వాట్సప్ అక్టోబర్ నుంచి ఐ ఓ ఎస్ 10, ఐఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే మొబైల్స్ లో పనిచేయదట. ఈ మేరకు ఈ ఆపరేటింగ్ సిస్టములు ఉపయోగిస్తున్న వారికి అందుకు సంబంధించి అలెర్ట్ ను కూడా జారీ చేసినట్లు సమాచారం.
వాట్సప్ సేవలను కొనసాగించాలి అంటే వారి యొక్క ఆపరేటింగ్ సిస్టములను అప్డేట్ చేసుకోవాలని యాపిల్ సంస్థ సూచిస్తున్నది ఐవోఎస్ 12 లేదా తర్వాత ఆపరేటింగ్ సిస్టంకు సపోర్ట్ చేసి మొబైల్స్ లోని ఈ వాట్స్అప్ పనిచేస్తుందని తెలియజేశారు. అయితే ముఖ్యంగా iphone -5, iphone 5c అనే రెండు మొబైల్స్ లో మాత్రమే ప్రభావితం చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఐఫోన్ ను అప్గ్రేటింగ్ చేసుకోవాలనుకునేవారు సెట్టింగ్ లోకి వెళ్లి అక్కడ జనరల్ ఆప్షన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ ను సెలెక్ట్ చేసుకుని అక్కడ తాజా ఐఓఎస్ వెర్షన్ గల వాటిని ఎంచుకుంటే సరిపోతుందట.