ప్రస్తుతం ఇప్పుడు ప్రతి ఒక్కరి కి ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన కార్డుగా మారిపోయింది. ఎందుచేత అంటే ప్రభుత్వం నుంచి లేదా ఇతర పథకాల నుంచి ఏదైనా బెనిఫిట్ లు పొందాలి అంటే కచ్చితంగా ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఇక అంతే కాకుండా బ్యాంకు లో ఖాతా ఓపెన్ చేయాలి అన్న ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాల్సింది. అయితే మనం బ్యాంకుకు ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా అనే విషయం తెలుసుకోవడం కోసం ఈమధ్య కాలంలో ప్రజలు సైతం చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి కోసం ఇప్పుడు ఆధార్ కార్డు నెంబర్ బ్యాంకు అకౌంట్ కు లింక్ అయిందో లేదో ఇలా తెలుసుకుంటే సరిపోతుంది. వాటి గురించి చూద్దాం.

అయితే ఆధార్ కార్డు కి మొబైల్ నెంబర్ కి రిజిస్ట్రేషన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా కొన్ని సమయాలలో ఏ బ్యాంకు అకౌంట్ కు ఆధార్ కార్డ్  మొబైల్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా తెలుసుకోవచ్చు. అందుచేతనే బ్యాంకుకు వెళ్లకుండానే మీ ఆధార్ కార్డు ఏ బ్యాంకుకు లింక్ అయ్యిందో అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది కేవలం ఆన్లైన్లో మాత్రమే చెక్ చేసుకోవచ్చు.

1). ముందుగా మనం www.uidai.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి.

2) అలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత my aadhar అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.


3). అటు తరువాత చెక్ యువర్ ఆధార్ అండ్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

4). ఈ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది..అలా అయినా వెంటనే అక్కడ ఆధార్ నెంబర్ మరియు క్యాప్స్ కోడ్ను ఎంటర్ చేయాలి.

5) అటు తరువాత ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ అయినా మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది.


6). ఆ ఓటిపిని uidai వెబ్సైట్లో నమోదు చేయాలి అలా చేసిన తర్వాత అక్కడ లాగిన్ పైన క్లిక్ చేస్తే.. అక్కడ మనకు ఆధార్ కార్డుతో లింక్ అయినా బ్యాంక్ అకౌంట్ యొక్క పూర్తి వివరాలను చూపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: