స్మార్ట్ ఫోన్ విభాగంలో వన్ ప్లస్ బ్రాండ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ మధ్యకాలంలో అతి తక్కువ ధరకే దొరుకుతున్న పలు స్మార్ట్ మొబైల్ ఫీచర్ కలిగిన మొబైల్ లో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో వరుస స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ కస్టమర్లను బాగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా వన్ ప్లస్ -11 మొబైల్ ను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వన్ ప్లస్-11 పోకి బదులుగా వన్ ప్లస్ 11 విడుదల చేయబోతున్నట్లు సమాచారం.


వచ్చే ఏడాది ప్రారంభంలో వన్ ప్లస్ కొత్త మొబైల్ ను విడుదల చేయబోతున్నట్లు మ్యాక్స్ జంగీర్ రిపోర్టు ప్రకారం తెలియజేయడం జరిగింది. ఇక ఈ మొబైల్ కు సంబంధించి ఫీచర్ల విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ పవర్ఫుల్ స్పెసిఫికేషన్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది ఈ మొబైల్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ -2 చీప్ సెట్ తో కలిగి ఉంటుందట. ఈ స్మార్ట్ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.7 అంగుళాల హెచ్డి డిస్ప్లే తో పాటు అమౌంట్ డిస్ప్లే కూడా కలదు. సెల్ఫీ ప్రియుల కోసం ప్రత్యేకంగా ఒక కెమెరాను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టం తో ఈ మొబైల్ పనిచేస్తుంది.100 w చార్జింగ్ ఫాస్ట్  చార్జింగ్ చేస్తుందట. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mah సామర్ధ్య కలదు ఇక ఈ స్మార్ట్ మొబైల్ త్రిబుల్ కెమెరాతో ఉండనున్నట్లు సమాచారం.5g మొబైల్ నెట్వర్కింగ్ సపోర్టును కూడా ఈ మొబైల్ చేస్తుందట అయితే ఈ మొబైల్ ధర విషయాన్ని మాత్రం ఇంకా తెలియజేయలేదు ఈ సమస్థ. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలి అంటే మరో కొద్ది రోజులలో ఈ మొబైల్ కి సంబంధించి అధికారికంగా అప్డేట్ ప్రకటిస్తే బాగుంటుందని కస్టమర్లు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: