టీవీఎస్ కంపెనీ ఇప్పటికీ ఎన్నో బైక్లను తమ కస్టమర్ల కోసం సరికొత్త మోడల్స్ విడుదల చేస్తూనే ఉంది. తాజాగా టీవీఎస్ బైక్ రైడర్స్ కోసం రూ.99,990 రూపాయలకి (ఎక్స్ షోరూం) దొరకే అందిస్తోంది ఇది గతంలో ఉన్న మోడల్ కంటే కూడా చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నది. అయితే ఇందులో 5 ఇంచెస్ TFT డిస్ప్లే కలదు వాస్తవానికి కంపెనీ ఈ బైక్ ని ఇప్పటికే మార్కెట్లో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత కాస్త లేటుగా లాంచ్ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇందులో SMART XCONNECT టెక్నాలజీ ఫీచర్ లను అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ బైక్ ను మొబైల్ కనెక్టివిటీ చేసుకొని సదుపాయం కూడా కలదు అందుచేతనే దీని ద్వారా టర్న్ బై టర్న్ నావిగేషన్ వాయిస్ కమాండ్ వంటి అలర్ట్ లు కూడా వస్తాయి. అంతేకాకుండా మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇందులో TFT స్క్రీన్ ద్వారా సర్వీస్ రిమైండ్ గేర్ పొజిషన్ ఇండికేటర్ తదితర వంటి ఫీచర్స్ ఇందులో ప్రవేశపెట్టినట్లు సమాచారం. కానీ మెకానికల్స్ పరంగా ఎటువంటి అప్డేట్ చేయలేదు.
ఈ సరికొత్త టీవీఎస్ రైడర్ 125 బైక్ లో ఇంటెల్లిగో సైలెంట్ ఇంజిన్ స్టార్ట్ సిస్టమ్ కూడా కలదు. ఇక 124.8 ఇంజన్ సిసి సిలిండర్, SOHC ఇంజన్ లభిస్తుంది. ఈ బైక్ 5.9 సెకండ్లలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందట. ఈ బైక్ ముందు భాగంలో 240 MM డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగాన 130 MM డ్రమ్ బ్రేక్ కలదు. ఈ బైక్ ఫ్యూయల్ కెపాసిటీ 10 లీటర్లు. ఈ బైక్ ఇదివరకు మోడల్స్ కంటే సరికొత్త ఫీచర్లతో కస్టమర్లను బాగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. బైక్ రైటర్ కొనాలనుకునే వారికి ఇదొక చక్కటి బైక్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: