ప్రముఖ షావోమి బ్రాండ్ .. రెడ్మీ నోట్ సిరీస్ కింద మూడు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. రెడ్ మీ నోట్ 12 సిరీస్ గా పిలిచే ఈ కొత్త లైన్ అప్లో 6.7 అంగుళాల ఓఎల్ఈడి డిస్ప్లే , డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్ , ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుందని కంపెనీ ప్రకటించింది. అందులో భాగంగా రెడ్మి నోట్ 12 తర్వాత రెడ్మి నోట్ 12 ప్రో, రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇక రెడ్మి నోట్ 12 ప్రో ప్లస్ మోడల్ పేరుతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్లో 200 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు..120 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అలాగే 12GB వరకు ర్యామ్ వంటి అద్భుతమైన ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.


ఇక ధరల విషయానికి వస్తే.. రెడ్మి నోట్ 12 ప్రో ప్లస్ తో ప్రారంభించి.. ప్రస్తుతం మూడు కలర్స్లో అందుబాటులో ఉంది.  అందులో బ్లూ, వైట్, బ్లాక్ వంటి కలర్ ఆప్షన్ లో వస్తుంది.  ఈ మోడల్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉండడం గమనార్హం.  అందులో ఒకటి 8GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,000 కాగా మరొక వేరియంట్ 12GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ వీరియంట్ ధర 27,300 అందుబాటులో ఉంది. అంతేకాదు రెడ్మీ నోట్ 12 Yibo ఎడిషన్ కూడా రూ.29,600 రేంజ్  లో అందుబాటులో ఉంది.


స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే 6.6 7 అంగుళాల డిస్ప్లే తో పాటు.. 2400 x 1080 పిక్సెల్ రిజర్వేషన్ తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేటుతో డాల్బీ విజన్ ఆడియోని కూడా పొందవచ్చు.  మీడియా టెక్ డైమెన్సిటీ .. 120 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ 5g స్మార్ట్ఫోన్లో 200 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ మైక్రో కెమెరాతో పాటు 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా అమర్చబడి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: