రూ.4 వేల లోపే షావోమి స్మార్ట్ మొబైల్ ఇటీవల ప్రకటించిన షియోమి క్లియరెన్స్ సేల్ నుండి ఈ ధమాకా ఆఫర్ ను కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచనుంది. అధికారిక వెబ్సైట్ mi.com నుండి ఈ సెల్ ద్వారా సగం ధరకే కొన్ని స్మార్ట్ మొబైల్ ను ప్రకటించడం జరిగింది. ఈ ఆఫర్లను గతంలో వచ్చిన ఓల్డ్ వెర్షన్ ఫోన్ల పైన మాత్రమే అందిస్తుందట. గతంలో మార్కెట్లో విడుదల చేయబడి అమ్మగా మిగిలిన స్టాక్ ఈ సంస్థ క్లియరెన్స్ సేల్స్ లో భాగంగా ఈ ఆఫర్లను చౌక ధరకే అందిస్తోందని తెలియజేయడం జరిగింది.

ఈ సెల్ నుండి 2018 లో వచ్చిన మోడల్ రెడ్మీ 6A స్మార్ట్ మొబైల్ ని రూ.3,999 రూపాయలకే పొందవచ్చు.ఈ మొబైల్ ఇప్పటికీ ఈ ధరలో గొప్ప ఫీచర్ లను కలిగి ఉన్న మొబైల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మొబైల్ 2 Gb Ram,16 gb మెమొరీ స్టోరేజ్ కలదు. ఇక వీటితోపాటు రెడ్ మీ నోట్ 7 ప్రో, రెడ్మీ Y-3, తదితర స్మార్ట్ మొబైల్స్ సగం ధరకే సేల్ చేస్తోంది. అయితే ఎవరైనా తక్కువ ధరకే మొబైల్స్ కొనాలని చూస్తున్నా వారు వెంటనే mi.com వెబ్సైట్ నుంచి నేరుగా కొనుగోలు చేసుకోవచ్చు.

Xiaomi redmi 6A మొబైల్ వివరాలు..
రెడ్మి 6A మొబైల్ ప్యానెల్ లో ఒక మోటాలిక్ కలిగిన బాడీ ఉంటుంది. ఈ మొబైల్ పట్టుకోవడానికి చాలా సులువుగా ఉంటుందని చెప్పవచ్చు.5.45 అంగుళాల హెచ్డి డిస్ప్లే తో కలదు. కెమెరా విషయానికి వస్తే ఆటో ఫోకస్ తో 13 మెగాపిక్ సెల్ సెన్సార్ కెమెరా వెనుక భాగంలో ఉంటుంది. అతి తక్కువ ధరలు విడుదలైన మొదటి స్మార్ట్ మొబైల్ ఇదే అని చెప్పవచ్చు. A1 ప్రో రైట్ మరియు A1 బ్యూటీ మోడ్ 5 mp సెన్సార్ కెమెరా కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: