కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జారీ చేసిన TAFCOP ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్యుమర్ ప్రొటెక్షన్ పేరుతో ఈ పోర్టల్ని స్థాపించడం జరిగింది ఇందులో ఆధార్ కార్డు నెంబర్ మీద ఎన్ని మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ అయ్యాయో సులభంగా తెలుసుకోవచ్చు. 2018లో ఈ టెలికాం శాఖ ఒక వ్యక్తికి 18 మొబైల్ కనెక్షన్ల వరకు తీసుకొని వెలుసుబాటును కల్పించింది. ఇందులో సాధారణంగా మొబైల్ వినియోగం కోసం 9 సిమ్ములు మిగిలిన 9 సిమ్ములు M2M కమ్యూనికేషన్ కోసం ఉపయోగించవచ్చని తెలియజేశారు. అయితే ఆధారం కార్డు మీద ఎన్ని సినిమాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1). ముందుగా మొబైల్ వినియోగదారులు..tafcop.dgtelecom.gov.in అని వెబ్సైట్లోకి వెళ్లాలి.
2). అక్కడ మన (మొబైల్/ ఆధార్) నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది.
3). అటు తరువాత మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది ఆ ఓటీపిని ఎంటర్ చేయాలి. అటు తర్వాత వాలిడేషన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది.
4). ఇప్పుడు అక్కడ చూపించిన విధంగా ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్ములు జారీ అయ్యాయో లిస్టు మనకు కనిపిస్తుంది.
ఒకవేళ అందులో మనకు తెలియని నెంబర్లు మన లిస్టులో ఉంటే టెలికాం శాఖకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంటుంది. అలా తెలియని నెంబర్ ఉంటే ఎడమ చెక్ బాక్స్ పైన క్లిక్ చేస్తే ఆ నెంబర్ పై ఫిర్యాదు చేయబడుతుంది.