ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5g మొబైల్స్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. దీంతో ఫైవ్ జి సేవలు కూడా పెరుగుతున్న కొద్దీ ఈ మొబైల్స్ సంస్థలు కూడా 5జి మొబైల్స్ ని మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉన్నారు ఇప్పటికే పలు రకాల స్మార్ట్ మొబైల్స్ కూడా 5జి సపోర్ట్ చేసే విధంగా తయారు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ స్మార్ట్ మొబైల్ దిగ్గజ ఇన్ఫినిక్స్ మార్కెట్లోకి సరికొత్త 5g మొబైల్ ని విడుదల చేసింది. మరి ఈ మొబైల్ ధర ఫీచర్స్ వంటి వాటి గురించి తెలుసుకుందాం.

Infinix HOT 20 -5G:
ఈ మొబైల్ విషయానికి వస్తే ఈ మొబైల్లో 120HZ హైపర్ విజన్ రి ఫ్రెష్ రేటింగ్ తో కలదు ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే..6.6 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే ను కలిగి ఉంటుంది. అలాగే మీడియా టెక్ డైనమిక్ 810. చీప్ సెట్ ద్వారా ఈ మొబైల్ రన్ అవుతుంది. ఈ స్మార్ట్ మొబైల్ హీట్ కాకుండా ఉండేందుకు ఇందులో బయోనిక్ బ్రీతింగ్ కూలింగ్ అని కూడా అమర్చినట్లుగా తెలుస్తోంది. ఇక కెమెరా విషయానికే వస్తే..ఇందులో 50 మెగాపిక్సల్ కెమెరా కలదు.


అలాగే సెల్ఫీ ఫ్రీయుల కోసం 8 mp మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలదు.4GB ప్రేమతో పాటు 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ మెమొరీ తో లభిస్తుంది. అడిషనల్ గా ఇందులో 3 జిబి రామ్ వరకు మనం పెంచుకోవచ్చు. ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే..5000MAH సామర్థ్యం తో కలిగి ఉంటుంది.18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ పనిచేస్తుంది.5 జి నెట్వర్క్ తో పనిచేసే ఈ మొబైల్ ధర విషయానికి వస్తే రూ.11,999 రూపాయలు కలదు డిసెంబర్ 9వ తేదీన ఫ్లిప్ కార్ట్ లో ఈ మొబైల్ అందుబాటులో ఉండనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: