ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా చలి విజృంభిస్తోంది ఇటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరు కూడా నీటికి సంబంధించిన విషయంలో చాలా సతమతమవుతూ ఉంటారు. ముఖ్యంగా వేడి నీరు కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కొంతమంది ఇళ్లల్లో గీజర్ ఉపయోగిస్తూ ఉంటారు.ఈ సీజన్లో ప్రజలు ఎక్కువగా గీజర్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే గీజర్ కొనడం అనేది ప్రతి ఒక్కరికి సాధ్యం కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది చాలా ఖరీదైన వస్తువులలో ఒకటని చెప్పవచ్చు. ఇటువంటి పరిస్థితులలో ఒక చౌకైన గీజర్న ఇప్పుడు మనం తెలుసుకుందాం.


వాస్తవానికి ఈ కామర్స్ దిగ్గజ సంస్థలలో ఒకటైన ఫ్లిప్ కార్ట్ తాజాగా ఒక బకెట్ను విక్రయిస్తోంది. ఇది గీజర్కు ప్రయత్నంగా ఉంటుందని దీని ధర కూడా చాలా తక్కువగా ఉంటుందని ఇది విద్యుత్ బిల్లుకు కూడా సహాయపడుతుందని ఆ కంపెనీ తెలియజేస్తోంది. ఇక బ్రాండెడ్ వచ్చి అభిరామ 20 ఎల్ ఇన్స్టంట్ వాటర్ గీజర్ ఫ్లిప్ కార్ట్ నుండి డిస్కౌంట్ తరువాత దీనిని కస్టమర్లకు 1,599 రూపాయలకే కొనుగోలు చేసే విధంగా ఆఫర్ ను ప్రకటించింది. అయితే దీని అసలు ధర మాత్రం రూ.2,499 రూపాయలు అన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఉత్పత్తిపై కస్టమర్లకు కంపెనీ ఒక ఏడాది పాటు వారంటీ కూడా ఇస్తోంది.

ఫ్లిప్ కార్ట్ పది రోజులపాటు రీప్లేస్మెంట్ ఆఫర్ను కూడా ప్రకటిస్తోంది.ఈ మల్టీ పర్పస్ హీటర్ 20 లీటర్ల సామర్థ్యం కలదట. ఈ గీజర్ లాంటి బకెట్ నిమిషాలలో నీటిని వేడి చేస్తుందని ఫ్లిప్ కార్ట్ అందించిన సమాచారం ప్రకారం తెలుస్తోంది.ఈ ఉత్పత్తి స్నానం చేయడానికి త్రాగడానికి వంటగదికి మరియు అనేక రకాల ప్రయోజనాల కోసం తయారుచేసినట్లుగా తెలుస్తోంది. ఇది పోర్టబుల్ ఉత్పత్తి ఇది షాక్ ప్రూఫ్ డిజైన్ తో తయారు చేయబడింది. ఇది ఎక్కడికైనా ప్రయాణానికి కూడా ఉపయోగించవచ్చట దీనితోపాటు బకెట్లో నీరు తీసుకోవడానికి కులాయి కూడా అందుబాటులో ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: