ప్రపంచ స్మార్ట్ మొబైల్ దిగ్గజ  సంస్థలలో ఆపిల్ మొబైల్స్ కు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా వరకు స్మార్ట్ మొబైల్ మేకర్స్ ఆపిల్ ఐఫోన్ మాదిరిగా తమ ప్రాడెక్టులను రూపొందించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందులో ముందు ఉండేది చైనా స్మార్ట్ మొబైల్ మేకర్స్ అని చెప్పవచ్చు ఇతర మొబైల్ ఫీచర్స్ లను అచ్చుగుద్దినట్లుగా దించేయడంలో చైనా స్మార్ట్ మొబైల్ కి ఎవరు సాటి రారు అని చెప్పవచ్చు. చైనా మొబైల్ ను చూస్తే పైకి మాత్రం అసలైన ఐఫోన్ లాగా కనిపిస్తాయి ఫీచర్లు కూడా అలాగే ఉంటాయి కానీ లోపల మాత్రం అన్ని చైనా బ్రాండ్ లో ఎక్కువగా ఉంటాయి.


సాధారణంగా ఆపిల్ కొత్త ప్రోడక్టులలో airpods,macpc లు టాబ్లెట్లు ఉంటాయి. ఏదైనా మార్కెట్లోకి కొత్తగా విడుదల కాగానే ఆండ్రాయిడ్ oem తమ సొంత డిజైన్లను అందించేందుకు పెద్దగా సమయాన్ని వృధా చేయవు అందుచేతనే తమ ప్రాజెక్టులను కూడా చౌకగా అందిస్తాయి గత ఏడాది ఆపిల్ ఐఫోన్-14 సిరీస్ ను లాంచ్ చేసింది ఈ మొబైల్ 14 మోడల్, ఐఫోన్ 13 సిరీస్ తో సమానంగా కనిపిస్తోంది.


ఇప్పుడు ఇలాంటి మొబైల్ ఒకటి చైనా ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేస్తోంది. అది చూడడానికి అచ్చం యాపిల్ మొబైల్ లాగానే కనిపిస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్ అయినప్పటికీ ఆపిల్ ఐఫోన్ తలదన్నేలా ఫీచర్ లను డిజైన్ చేసింది చైనా టెక్ బ్రాండెడ్ సంస్థ ..LEECO కంపెనీ ఐఫోన్ -14 ప్రో మాదిరిగానే కనిపించే ఈ లీకో ఎస్1 ప్రో మొబైల్ ను విడుదల చేసింది. ఈ మొబైల్ హార్డ్వేర్ లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ధర మాత్రం చాలా చౌకగానే ఉంటుందని సమాచారం ఈ స్మార్ట్ మొబైల్ 6.5 అంగుళాల ఎల్సిడి డిస్ప్లేను కలిగి ఉంటుందట. అలాగే హాయ్ అండ్ ఫోర్ కె రిజల్యూషన్ తో కలదట.


మరింత సమాచారం తెలుసుకోండి: