ఇక ఎక్స్ పో 2023, అన్ని పెద్ద ఆటోమోబైల్ కంపెనీలకు చాలా మంచి ప్లాట్ఫారం అయ్యింది.మన ఇండియన్ మార్కెట్ లో తమ ముద్ర వేసేందుకు తమ తమ వాహనాలను ప్రదర్శించాయి. అయితే హోండా కంపెనీ మాత్రం ఈ షో పై పెద్దగా ఆసక్తి చూపలేదు. చివరి క్షణంలో తన లేటెస్ట్ అప్డేటెడ్ ఇంటర్నేషనల్ లెవెల్ టూ వీలర్ ని ప్రదర్శించి, అందరి దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. ఇక ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్లో డిజైన్ చేయబడిన ఈ బైక్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఇక బ్రెజిల్ టెక్నాలజీతో కూడిన ఈ సింగిల్ సిలెండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కలిగిన హోండా ఎక్స్ఆర్ఈ 300 బైక్ ను ఆ కంపెనీ ఆటో ఎక్స్ పో 2023 పెవిలియన్ లో పెర్ఫార్మ్ చేసింది. ఇది 29.66 సీసీ ఇంజిన్ పవర్ తో గ్యాసోలిన్ ఇంకా అలాగే ఇథనాల్ రెండింటితో కూడా నడిచే ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్. ఇక ఇది గ్యాసోలిన్ తో నడిచేటప్పుడు 7500 ఆర్పీఎం వద్ద 25.4 హెచ్ పీ పవర్, 27.6 ఎన్ఎం టార్క్ ను జెనరేట్ చేస్తుంది.


ఇంకా అలాగే ఇథనాల్ తో నడిచేటప్పుడు 7500 ఆర్పీఎం వద్ద 25.6 హెచ్ పీ పవర్ ఇంకా 28 ఎన్ఎం టార్క్ ను జనరేట్ చేయగలుగుతుంది. ఇది ఆరు గేర్ల సిస్టంతో పనిచేస్తుంది. ఈ వేరియంట్ దాదాపు ఐదు గేర్ల సిస్టంతో కూడి రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ మోడల్ లాగా ఉంటుంది. ఇక ఈ బైక్ కి పోటీగా హోండా కంపెనీ ఈ ఎక్స్ఆర్ఈ 300 ని లాంచ్ చేసింది.ఇక ఈ కేటగిరీకి చెందిన బైకులు సాధారణంగా 19 అంగుళాల పొడవు ఇంకా 17 అంగుళాల వెడల్పు కలిగిన అల్లాయ్ వీల్స్ తో వస్తాయి. కానీ హోండా ఎక్స్ఆర్ఈ 300 బైక్ మాత్రం మొత్తం 21 అంగళాల వీల్స్ తో వస్తుంది.దీని సీట్ హైట్ వచ్చేసి 860 ఎంఎం ఉంటుంది. ఇది కేటీఎం 390 కన్నా ఎక్కువ అనే చెప్పాలి. ఫ్రంట్, బ్యాక్ రెండువైపులా కూడా డిస్క్ బ్రేకులు అనేవి ఉంటాయి.అలాగే దీనిలో ఎల్ సీడీ డిస్ ప్లే కూడా ఉంటుంది. ఇంకా అలాగే బండి ముందు వెనుక ఎల్ఈడీ లైట్లు కూడా ఉంటాయి. అలాగే ఇది యాంటీ లాక్ బ్రేక్స్( ఏబీఎస్)ను కలిగి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: