ఇండియాలో టాప్ కార్ల తయారీ సంస్థగా దూసుకుపోతున్న టాటా ఆటో ఎక్స్ పో 2023 లో మరో కొత్త సూపర్ ఈవీ కార్ ను ప్రవేశపెట్టడం జరిగింది.ఇక ఇప్పటికే ఎస్ యూవీ, కాన్సెప్ట్ లు ఇంకా అలాగే ఫేస్ లిఫ్ట్ ల వంటి అద్భుత లైనప్ లను  టాటా ప్రదర్శించింది. ఇంకా ఈ సెగ్మెంట్ లో కొత్త మోడల్ టాటా అవిన్య ఈవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఎలక్ట్రిక్ కార్ ను స్టైలిష్ అండ్ సాఫ్ట్ ఎంపీవీగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఈ గ్రౌండ్ అప్ ఎలక్ట్రిక్ కార్ ఆటో ఎక్స్ పోలోని అందరి ప్రశంసలు పొందింది. ఇంకా అలాగే ఈ కార్ ను 2025 వ సంవత్సరంలో భారత మార్కెట్ లో ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తాజా నివేదికలు కూడా పేర్కొంటున్నాయి. ఇంకా అలాగే కంపెనీ ప్రతినిధులు ఈ కార్ గురించి చెప్పిన అదనపు ఫీచర్ల గురించి అలాగే ఈ కార్ కి సంబంధించిన పూర్తి వివరాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ టాటా అవిన్య ఈవీ కార్ అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. ఈ కార్ ను కేవలం 30 నిమిషాలు చార్జ్ చేస్తే చాలు ఏకంగా 500 కిలోమీటర్ల మైలేజ్ ను ఇస్తుంది. ఇంకా అలాగే అవిన్య కార్ జెన్ 3 ఆర్కిటెక్చర్ పై కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ కార్ చాలా కొత్త డిజైన్ తో వస్తుంది.


టాటా కంపెనీ నుంచి భవిష్యత్ లో వచ్చే సూపర్ ఎలక్ట్రిక్ కార్లు ఎలా ఉండబోతున్నాయో? అనే దానికి ఉదాహరణగా ఈ కొత్త కార్ ఉంది. ఇంకా అలాగే టాటా లోగోను కూడా చాలా కొత్తగా డిజైన్ చేశారు. అలాగే ఈ కార్ డోర్స్ కూడా  బటర్ ఫ్లై రెక్కల రూపంలో చాలా అందంగా ఉంటాయి.అలాగే ఈ తలుపుల వల్ల కార్ కు మంచి స్పోర్టీ లుక్ కూడా వచ్చింది.ఇక ఈ అవిన్య కార్ ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇది సాదా డ్యాష్ బోర్డ్ లే అవుట్ తో వస్తుంది. అయితే ఈ కార్ లోపల ఎలాంటి టచ్ స్క్రీన్ డిస్ ప్లే లనేవి లేవు. అలాగే టాటా తన ఫ్యూచర్ లో ఈవీ కార్లన్ని కూడా వాయిస్ కంట్రోల్ తో పని చేసేలా ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి ఈ కార్ లో టచ్ స్క్రీన్ డిస్ ప్లేలు లేవని మార్కెట్ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఇంకా అలాగే ఈ కార్..సీట్లకు ఉండే హెడ్ రెస్ట్ లో ఇంటిగ్రేటెడ్ స్పీకర్లతో వస్తుంది. అలాగే ఈ కార్ చాలా సౌకర్యవంతమైన క్యాబిన్ ఇంకా అలాగే అనేక టెక్నాలజీ ఎయిడెడ్ ఫీచర్ల ద్వారా ప్రీమియం కస్టమర్ అనుభవాన్ని అందిస్తుంది. కాబట్టి ధనవంతులను పెద్ద పెద్ద బిజినెస్ మాగ్నెట్ లను దృష్టిలో పెట్టుకుని రిలీజ్ చేసిన ఈ కార్ వారి ఆదరణను పొందుతుందో? లేదో? మార్కెట్ లోకి రిలీజ్ అయ్యాక దీని పెర్ఫార్మన్స్ ఏంటో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: