వాట్సాప్‌ ఇప్పుడు యూజర్ లకి అనుగుణంగా చాలా ట్రెడింగ్‌గా మారిపోయింది. ఇండియాలో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్‌ యాప్‌లో వాట్సాప్‌ ఖచ్చితంగా ఒకటి. ఈ రోజుల్లో ఈ యాప్‌ లేనిది స్మార్ట్‌ఫోన్‌ లేదు.ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు కూడా జనాలు వాట్సాప్ లో మునిగి తేలుతుంటారు. చాటింగ్‌లు, వాట్సాప్‌ స్టేటస్‌లతో చాలా బిజీగా ఉంటారు. అయితే యూజర్లను మరింతగా ఆకట్టుకునేందుకు వాట్సాప్‌ కంపెనీ ఎన్నో కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇక వాట్సాప్‌ మెసేజ్‌ చేయాలంటే మీరు ముందుగా మొబైల్‌లో ఆ నంబర్‌ ని సేవ్‌ చేసి ఉండాలి. అయితే చాటింగ్‌ ఇంకా మెసేజ్‌లు పంపేందుకు అవకాశం ఉంటుంది. కానీ నంబర్‌ సేవ్‌ చేసుకోకుండా కూడా వాట్సాప్‌ మెసేజ్‌ ని మీరు పంపవచ్చు. ఇక థర్డ్‌పార్టీ యాప్స్‌ ని ఉపయోగించి వ్యక్తి నంబర్‌ సేవ్‌ చేసుకోకుండానే వాట్సాప్‌లో మెసేజ్‌ చేసే ఛాన్స్ ఉంది. అయితే థర్డ్‌పార్టీ యాప్స్‌ను ఉపయోగించి మెసేజ్‌ చేయడం మన భద్రతకే భంగం కలుగుతుంది. అంతేకాకుండా మనల్ని ప్రమాదంలోకి నెట్టే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి సందర్భాలను మనలో చాలా మంది  కూడా ఎదుర్కొన్న వాళ్లు ఉంటారు. 


ఇక వాట్సాప్‌లో నంబర్‌ లేకుండా మెసేజ్ ఎలా పంపాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా మీరు మీ ఫోన్‌లోని బ్రౌజర్‌ని(క్రోమ్‌ లేదా ఫైర్‌ఫాక్స్‌ ని ఒపెన్‌ చేయండి.తరువాత ఇప్పుడు మీరు http://wa.me/xxxxxxxxxx లింక్‌ని కాపీ చేసి యూఆర్‌ఎల్‌ అడ్రస్‌ బార్‌లో పేస్ట్‌ చేయాలి. ఇక్కడ xxxxxxxxxx స్థానంలో మన దేశం కోడ్‌ 91తో పాటు మీరు మెసేజ్‌ పంపాలనుకున్న మొబైల్‌ నంబర్‌ను మీరు ఎంటర్‌ చేయాలి. ఉదాహరణకు మీ వాట్సాప్‌లో సేవ్‌ చేసుకోలేని ఓ వ్యక్తి నెంబర్‌కు http://wa.me/919911111111 అని మీరు ఎంటర్‌ చేయాలి. ఇక్కడ మొదటి రెండు అంకెలు కూడా మన దేశ కోడ్‌ ని సూచిస్తాయి. తరువాత మెసేజ్‌ పంపాలనుకున్న వ్యక్తి మొబైల్ నంబర్‌ ఎంటర్ చేసిన తరువాత మీరు వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌తో గ్రీన్‌ కలర్‌తో మెసేజ్‌ బటన్‌తో ఒక వాట్సాప్‌ పేజీ మీకు ఓపెన్‌ అవుతుంది. గ్రీన్‌ కలర్‌ మెసేజ్‌బటన్‌పై క్లిక్‌ చేస్తే మీరు ఈజీగా వాట్సాప్‌కు మళ్లించబడతారు. ఇక అంతే మీరు వ్యక్తి నెంబర్‌ను సేవ్‌ చేసుకోకుండా ఈ విధంగా ఈజీగా మెసేజ్‌ చేయవచ్చును.

మరింత సమాచారం తెలుసుకోండి: