రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం కూడా పెరుగుతూనే వస్తోంది. పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని పెరుగుతూ ఉండడంతో వాహన వినియోగదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలవైపే మక్కువ చూపుతున్నాయి. దీంతో వాహనాలకు ఉన్న క్రేజ్ ప్రతిరోజు పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే పలు కంపెనీలు కూడా మంచి మంచి ఫీచర్స్ కలిగిన ఎలక్ట్రిక్ బైకులను కూడా తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. తాజాగా మార్కెట్లోకి ఐరా పేరుతో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల అవ్వడం జరిగింది.


అద్భుతమైన లుక్కుతో వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది .ఈ ఎలక్ట్రిక్ బైక్. 230w మోటర్ ఉంటుందట.స్పీడు గంటకి 25 కిలోమీటర్లు అన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 90 కిలోమీటర్ల వరకు వెళుతుందట. గరిష్టంగా ఈ ఎలక్ట్రిక్ బైక్ ఇద్దరికి మాత్రమే లాగగలదట. స్వల్ప దూరపు ప్రయాణాలకు మాత్రమే ఈ స్కూటర్ చాలా అనుకోగా ఉంటుందని సమాచారం.ఎక్కువ దూరం వెళ్లగలిగాలి అనుకునేవారు స్పీడుగా వెళ్లాలనుకునే వారికి ఈ స్కూటర్ అసలు సెట్ కాదట. డిజిటల్ స్పీడోమీటర్ కూడా ఇందులో కలదు అయితే చూడడానికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సూపర్ డిజైనింగ్ తో తయారు చేయడం జరిగింది.


ముఖ్యంగా రెడ్ ఎల్లో వంటి రంగులలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. ఈ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించేవారు నేరుగా కంపెనీ అధికారిక వెబ్సైట్లోనే బుక్ చేసుకోవాలట.త్వరలోనే ఈ కంపెనీ అందుబాటులోకి తీసుకురాబోతోంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎక్స్ షోరూమ్ రూ.76,750 నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్కూటర్ బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ కావడానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుందని తెలుస్తోంది. ఇందులో లైట్ ఎల్ఈడి లైట్స్ ఎల్ఈడి టర్నో సిగ్నల్ డిస్క్ బ్రేక్ అలం వీల్స్ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయట. అయితే ఇది సిటీస్ లో ఉండే వారికి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: